Balakrishna:ఎన్నికల ప్రచారంలో అభిమానిపై చేయి చేసుకున్న బాలకృష్ణ
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి అభిమానిపై చేయి చేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలయ్య అనంతపురం జిల్లా కదిరి నుంచి సైకిల్ రావాలి యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర కోసం కదిరి చేరుకున్న సందర్భంగా బాలయ్యతో సెల్పీ కోసం ఓ అభిమాని ప్రయత్నించాడు. దీంతో బాలకృష్ణకు చిర్రెత్తుకొచ్చి అతడిని పక్కను నెట్టి చేయి చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు విభన్నంగా స్పందిస్తున్నారు. అలా పైన బడి సెల్ఫీలు తీసుకుంటే పక్కకు నెట్టారా అని కొందరు బాలయ్యకు మద్దతుగా కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు బాలయ్య ఇంతే అంటున్నారు.
గతంలోనూ ఇలాగే పలు సందర్భాల్లో అభిమానులు, టీడీపీ కార్యకర్తలపై బాలయ్య చేయిచేసుకున్నారు. దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. అయినా కానీ బాలయ్య తీర మాత్రం మారలేదు. ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా కదిరిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామిని ఆయన దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 'రావాలి సైకిల్' యాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు కూడలిలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రికి సింగనమల చేరుకుని అక్కడే బస చేస్తారు. ఆదివారం సైకిల్ యాత్ర కర్నూలు జిల్లాకు చేరుకుంటుంది.
బాలయ్య యాత్ర కోసం ప్రత్యేక బస్సును సిద్ధం చేశారు. ఈ బస్సుకు పూర్తిగా పసుపు రంగులను అద్దారు. బస్సు పై భాగంలో ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ అని రాశారు. అద్దంపై టీడీపీ పార్టీ గుర్తు సైకిల్ స్టిక్కర్ అతికించారు. సైడ్లు బాలయ్య అన్‌స్టాపబుల్.. తెలుగుదేశం పిలుస్తోంది రా..! కదలిరా..! అనే అక్షరాలను పొందుపరిచారు. ఇక బస్సుకు ఇరువైపులా స్వర్గీయ ఎన్టీఆర్ ఫొటో.. బీజేపీ-టీడీపీ-జనసేన గుర్తులతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఫొటోలను ఉంచారు. ఈ యాత్రలో భాగంగా ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాలోని నియోజకవర్గాలలో బాలయ్య పర్యటించేలా షెడ్యూల్ రూపొందించారు.
కాగా బాలయ్య అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం మూడో సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. 2014, 19 ఎన్నికల్లో రెండు సార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది. 1982లో పార్టీ ఆవిర్భావం నుంచి హిందూపురం టీడీపీకి కంచుకోటగా ఉంది. మరోవైపు బాలయ్యపై వైసీపీ నుంచి దీపిక పోటీ చేస్తున్నారు. మరి ఈ ఎన్నికల్లో బాలయ్య మచ్చటగా మూడో సారి గెలుస్తారా.. గెలిస్తే ఎంత మెజార్టీతో గెలుస్తారు అనే దానిపై ఇప్పటికే పందేలు కాసుకుంటున్నారు.
అభిమానులపై ఎమ్మెల్యే బాలకృష్ణ దురుసు ప్రవర్తన
— Jagananna Ki Thoduga Siddham (@JThoduga) April 13, 2024
అభిమానిపై చేయి చేసుకున్న నందమూరి బాలకృష్ణ#EndOfTDP #AndhraPradesh #ApPolitics #Balakrishna #TDPJSPBJPCollapse pic.twitter.com/pfVVpnar5N
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments