సేమ్ ఫీట్ రిపీట్ చేయ‌నున్న బాల‌య్య‌

  • IndiaGlitz, [Friday,March 30 2018]

శ‌తాధిక చిత్రాల క‌థానాయ‌కుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌.. గ్యాప్ లేకుండా సినిమాలు చేయ‌డంలో ఎప్పుడూ ముందుంటారు. ఏడాదికి క‌నీసం ఒక సినిమా అయినా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకునే ఈ సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుడు.. ఈ ఏడాదిలో రెండు సినిమాల‌తో అభిమానుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే సంక్రాంతికి జై సింహాతో సంద‌డి చేసి.. త‌న ఖాతాలో మ‌రో విజ‌యాన్ని న‌మోదు చేసుకున్నారు.

గురువారం త‌న తండ్రి నంద‌మూరి తార‌క రామారావు జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న య‌న్.టి.ఆర్ బ‌యోపిక్‌ను లాంఛ‌నంగా ప్రారంభించారు. తొలుత ఈ సినిమా సంక్రాంతికి వ‌స్తుంద‌ని వినిపించినా.. ద‌స‌రాకే ఈ సినిమా విడుద‌ల కానుంద‌ని తేజ అనౌన్స్ చేశారు. ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. గ‌తేడాది గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి, పైసా వ‌సూల్.. ఇలా రెండు సినిమాల‌తో సంద‌డి చేసిన బాల‌య్య‌.. ఈ ఏడాది కూడా అదే ఫీట్‌ను రిపీట్ చేయ‌నున్నార‌న్న‌మాట‌.