రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు బాలకృష్ణ బాసట

  • IndiaGlitz, [Tuesday,July 14 2015]

గోదావరి పుష్కారాలు ఈరోజు ప్రారంభమైయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలోని గోదావరి పుష్కరఘాట్ మొదటి ప్రవేశ ద్వారం వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది భక్తులు మృతి చెందగా, పలువురి గాయాలయ్యాయి. గాయపడిన వారికి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ప్రమాదంపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నప్పటికీ పుష్కర సమయంలో ఇటువంటి ఘటన జరగడం బాధగా ఉంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి కుటుంబాలకు నా సహాయ సహాకారాలు ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వం వారి కుటుంబాలను అదుకుంటుంది. అలాగే భక్తులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని పుష్కరాల్లో క్షేమంగా ఉండాలి. భక్తులు పోలీసులు, అధికారులకు సహకరించండి. నా అభిమాలు కూడా ఈ పుష్కరాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు సహకారం అందజేయాలని బాలకృష్ణ అన్నారు.