అబ్బాయి కోసం బాబాయ్...
- IndiaGlitz, [Saturday,October 20 2018]
నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య కొన్ని రోజుల ముందు వరకు సరిగ్గా మాటలు లేవు. సైలెంట్ యుద్ధం కొనసాగుతుందని వార్తలు వినపడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పుడు బాబాయ్, అబ్బాయ్ దగ్గరయ్యారు.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' .. విడుదలైంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కే బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరవుతారని వార్తలు వచ్చినా బాలకృష్ణ హాజరు కాలేదు. అయితే ఇప్పుడు 'అరవిందసమేత.' సక్సెస్మీట్కు ముఖ్య అతిథిగా బాలకృష్ణ హాజరవుతున్నారట.
ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో అక్టోబర్ 11న విడుదలైన 'అరవింద సమేత' చిత్రం చాలా పెద్ద విజయాన్ని సాధించింది. ఆదివారం సక్సెస్‌మీట్‌ను నిర్వహిస్తున్నారు.