కవలలుగా బాలయ్య
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ 106వ చిత్రం మార్చి నుండి ప్రారంభం కానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. సింహ, లెజెండ్ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, అందులో ఓ పాత్ర అఘోరా పాత్ర అని వార్తలు వినిపించాయి. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ చిత్రంలో బాలకృష్ణ కవలలుగా కనిపించబోతున్నాడట. కవలలు చిన్నప్పుడే విడిపోతారట. ఓ అబ్బాయి వారణాసిలో.. మరో అబ్బాయి రాయలసీమలో పెరుగుతాడట.
వారణాసిలో పెరిగిన అబ్బాయి అఘోరాగా మారుతాడట. ఆ పాత్ర ఇంటర్వెల్‌లో ఎంట్రీ ఇస్తుందట. శ్రియా శరన్, అంజలి హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో జగపతిబాబు విలన్‌గా నటించబోతున్నాడట. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు బాలకృష్ణను తన సినిమాల్లో తండ్రీ కొడుకులుగా, అన్నదమ్ములుగా చూపించిన బోయపాటి తొలిసారి కవల సోదరులుగా చూపించనున్నారు. నవగ్రహాలు, ఆధ్యాత్మిక అంశాలను కూడా ఈ కథకు లింక్ పెట్టారట బోయపాటి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments