ఆలస్యమైంది.. కానీ ధన్యవాదాలు చెప్పిన బాలయ్య
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ ఓ ప్రముఖ వ్యక్తికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. అయితే ఈ ధన్యవాదాలు చెప్పడంలో ఆలస్యం జరిగింది కానీ.. బాలయ్య మాత్రం ఆయనకు థాంక్స్ చెప్పారు. ఇంతకూ బాలయ్య నుండి థాంక్స్ అందుకున్న వ్యక్తి ఎవరో కాదు తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్. ఇంతకూ కేసీఆర్కు బాలయ్య ఎందుకు ధన్యవాదాలు చెప్పినట్లు. వివరాల్లోకెళ్తే బాలకృష్ణ తన తండ్రి స్వర్గీయ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితకథను పాఠ్యాంశంగా తెలంగాణ పదవ తరగతిలో యాడ్ చేశారు. అయితే ఈ పని జరిగి ఐదేళ్లు అవుతుంది. అయితే బాలకృష్ణ దృష్టికి ఈ విషయం ఇప్పుడే వెళ్లిందేమో కానీ.. తన ఫేస్ బుక్ ద్వారా బాలకృష్ణ ..ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు చెప్పారు.
‘‘కళకి, కళాకారులకి విలువను పెంచిన కధానాయకుడు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పీఠాన్ని కదలించేలా వినిపించిన మహానాయకుడు, ఎన్నో సాహసోపేతమైన ప్రజారంజక నిర్ణయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజానాయకుడు, మదరాసీయులమనే పేరుని చెరిపి భారతదేశపటంలో తెలుగువాడికి, తెలుగు వేడికి ఒక ప్రత్యేకతని తెచ్చిన తెలుగుజాతి ముద్దు బిడ్డ ,అన్నగారు, మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారి గురించి భావి తరాలకి స్ఫూర్తినిచ్చేలా 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకం లో పాఠ్యాంశముగా చేర్చిన తెలంగాణా ప్రభుత్వానికి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు’’ అని తెలిపారు బాలకృష్ణ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout