మే 28న ఎన్టీఆర్ బయోపిక్
Send us your feedback to audioarticles@vaarta.com
మహానటుడు స్వర్గీయ ఎన్టీఆర్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ఓ బయోపిక్ ఫిల్మ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. నేనే రాజు నేనే మంత్రి వంటి హిట్ చిత్రంతో బౌన్స్‌బ్యాక్ అయిన సంచలన దర్శకుడు తేజ టేకాఫ్ చేస్తున్న ఈ సినిమా కార్తీక మాసం సందర్భంగా ప్రారంభం కానుంది.
ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని మే 28న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
కాగా, ప్రస్తుతం బాలకృష్ణ.. కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంలో నయనతార, నటాషా దోషి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రెజీనా పేరు కూడా మరో హీరోయిన్గా వినిపిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments