Nandamuri Taraka Ratna: తారకరత్న హఠాన్మరణం.. అనాథలైన పిల్లలు, బాలయ్య సంచలన నిర్ణయం

  • IndiaGlitz, [Monday,February 20 2023]

సినీనటుడు నందమూరి తారకరత్న ఆకస్మిక మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. సౌమ్యుడిగా, వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న తారకరత్న చిన్న వయసులోనే దూరం కావడాన్ని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణవార్త తెలుసుకున్న ప్పటి నుంచి సినీ , రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు మోకిలలోని తారకరత్న నివాసానికి చేరుకుని ఆయనకు నివాళులర్పిస్తున్నారు.

తారకరత్న మరణంతో అనాథలైన భార్యాబిడ్డలు:

ఇదిలావుండగా.. తారకరత్న అకాల మరణంతో ఆయన భార్య, ముగ్గురు బిడ్డలు తండ్రి లేనివారయ్యారు. పెద్దమ్మాయి నిషిక, కవల పిల్లలు తనయ్ రామ్, రేయాలను చూసి పలువురు కంటతడి పెడుతున్నారు. ఇక నిషిక తండ్రి రాడని తెలిసి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. బాలకృష్ణ, విజయసాయిరెడ్డి సహా పలువురు ఆమెను ఓదారుస్తున్నారు. మరోవైపు.. తారకరత్న అంటే బాలయ్యకు ఎంతో ఇష్టమన్న సంగతి తెలిసిందే. ఆయన సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి నేటి వరకు తారకరత్న బాగోగులను దగ్గరుండి చూసుకున్నారు. అంతేకాదు.. గుండెపోటుతో కుప్పకూలిపోతే కుప్పం , బెంగళూరు ఆసుపత్రుల్లోనే వుండి తారకరత్నకు మెరుగైన వైద్యం అందేలా చూసుకున్నారు. కుటుంబ సభ్యులు, వైద్యులకు అందుబాటులో వుంటూ సమన్వయం చేసుకున్నారు.

తారకరత్న పిల్లల బాధ్యతలు తీసుకున్న తారకరత్న:

ఈ క్రమంలో బాలకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తారకరత్న ముగ్గురు పిల్లలను ఆయన దత్తత తీసుకున్నట్లుగా ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వారి చదువు సంధ్యలు, పోషణ బాధ్యత బాలయ్య తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరి దీనిలో ఎంత వరకు నిజం వుందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న:

కాగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్ కుప్పంలో ఇటీవల యువగళం పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తారకరత్న కూడా హాజరయ్యారు. అభిమానుల తాకిడి, ఎండ ప్రభావం ఎక్కువగా వుండటంతో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాసేపు విశ్రాంతి అనంతరం తిరిగి పాదయాత్రకు సిద్ధమవుతూ వుండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో తారకరత్నను హుటాహుటిన కుప్పం ఆసుపత్రికి తరలించి సీపీఆర్ చేయించారు. ఆ వెంటనే పీఈఎస్ వైద్య కళాశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు.

23 రోజుల పాటు మృత్యువుతో పోరాటం:

అక్కడ ఆయన 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడారు. రెండు రోజుల క్రితం కూడా బ్రెయిన్ స్కాన్ తీశారు వైద్యులు. ఈ క్రమంలో ఈ రోజు ఆయన ఆరోగ్యం విషమించింది. తారకరత్నను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ నేపథ్యంలో ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. తారకరత్న మరణంతో నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

More News

Tamilisai Soundararajan : కాలు జారి కిందపడిపోయిన గవర్నర్ తమిళిసై .. వీడియో వైరల్

తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే..

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత.. కేసీఆర్, కేటీఆర్ సంతాపం

బీఆర్ఎస్ నేత, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జీ సాయన్న (72) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ , గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన..

Actor Naresh:నరేష్ ఇంటిపై దుండగుల దాడి, కారు ధ్వంసం.. రమ్య రఘుపతే చేయించిందని ఫిర్యాదు

సీనియర్ నటుడు వీకే నరేష్‌‌ తన కారుపై దాడి జరిగిందంటూ పోలీసులను ఆశ్రయించడం కలకలం రేపుతోంది.

KL Damodar Prasad:తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా దామోదర్ ప్రసాద్.. దిల్‌రాజుదే పైచేయి

టాలీవుడ్‌లో ఉత్కంఠ రేపిన నిర్మాతల మండలి ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడిగా దామోదర ప్రసాద్ ఎన్నికయ్యారు.

PM Narendra Modi:తారకరత్న కన్నుమూత : మోడీ సంతాపం, నివాళులర్పించిన చంద్రబాబు, ఎన్టీఆర్, విజయసాయిరెడ్డి

సినీనటుడు నందమూరి తారకరత్న మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.