బాలయ్య స్టైల్ మార్చనున్న బోయపాటి ?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏ సినీ పరిశ్రమలోనైనా సక్సెస్ ఫుల్ కాంబినేషన్ పై అంచనాలు ఎక్కువగా ఉంటాయి. తెలుగు సినీ పరిశ్రమలో హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటిది కూడా అలాంటి కాంబోనే. గతంలో వీరిద్దరూ కలసి చేసిన 'సింహా', 'లెజెండ్' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలని సొంతం చేసుకున్నాయి. అయితే ప్రస్తుతం వీరిద్దరూ సక్సెస్ ట్రాక్ లో లేరు.'వినయ విధేయ రామ' తరువాత బోయపాటి శ్రీను మరో సినిమా చేసింది లేదు. తాజాగా 'రూలర్' తో బాలయ్యకి కూడా ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీరి కలయికలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ మూవీ ఇటు మాస్ హీరోకి, అటు మాస్ డైరెక్టర్ కి కూడా కీలకంగా మారింది.
నిజానికి బోయపాటితో బాలయ్య సినిమా చేస్తున్నాడంటే ఆ ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ నమ్మకంగా ఉంటారు. అందుకు కారణం లేకపోలేదు. ఈ మాస్ డైరెక్టర్ సినిమాలో బాలకృష్ణ లుక్ పై చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. 'సింహా', 'లెజెండ్' చిత్రాలలో బాలయ్య లుక్ సూపర్ సక్సెసయింది. 'రూలర్' లో నందమూరి హీరో లుక్ ఫ్యాన్స్ ని సైతం నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలోనే మరోసారి బోయపాటి బాలకృష్ణ లుక్ విషయంలో స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించాల్సి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బోయపాటి కూడా తన సినిమాల విషయంలో స్టైల్ మార్చాల్సిన అవసరముందని క్రిటిక్స్ అంటున్నారు. ఈ మాస్ డైరెక్టర్ గత చిత్రాల ప్యాట్రన్ అంతా ఒకేలా సాగుతూ వస్తోంది. దీనితో బాలయ్య కోసం బోయపాటి కథ, కథనాలతో కాస్త కొత్తతనం చూపితే బెటరన్న టాక్ వినిపిస్తోంది. ఈ మార్పులు కనుక జరిగితే బాలయ్య- బోయపాటి కాంబోలో 'లెజెండ్' లాంటి మ్యాజిక్ రిపీట్ అవ్వడం అసాధ్యమేమీ కాదు. మరి ఇద్దరికీ ఎంతో కీలకంగా మారిన తమ హ్యాట్రిక్ మూవీ విషయంలో బోయపాటి శ్రీను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో చూడాలి...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments