'రూలర్' అభిమానులు, ప్రేక్షకులను మెప్పిస్తుంది - బాలకృష్ణ
Send us your feedback to audioarticles@vaarta.com
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతోన్న చిత్రం `రూలర్`. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్య్రకమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శనివారం ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ మూవీ ట్రైలర్‌ను బోయపాటి శ్రీను, నందమూరి రామకృష్ణ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ, వాసుపల్లి గణేష్, సి.కల్యాణ్, కె.ఎస్.రవికుమార్, సోనాల్ చౌహాన్, వేదిక తదితరులు పాల్గొన్నారు.
సోనాల్ చౌహాన్ మాట్లాడుతూ - ``బాలకృష్ణగారితో నేను చేస్తోన్న మూడో సినిమా ఇది. ఆయనతో సినిమా చేయడం హ్యాపీ. నాకు అవకాశం ఇచ్చిన కె.ఎస్.రవికుమార్‌గారికి, సి.కల్యాణ్‌గారికి థ్యాంక్స్`` అన్నారు.
వేదిక మాట్లాడుతూ - ``తెలుగులో చాలా ఏళ్ల తర్వాత చేస్తోన్న సినిమా. బాలకృష్ణగారితో నా తొలి చిత్రం. షూటింగ్ సమయంలో ఆయన నాకు హెల్ప్ చేయడమే కాదు.. నన్ను చాలా ఇన్‌స్పైర్ చేశారు. సి.కల్యాణ్‌గారికి, కె.ఎస్.రవికుమార్‌గారికి థ్యాంక్స్`` అన్నారు.
సౌతిండియా ఫిలించాంబర్ అధ్యక్షుడు రవి కొటాకర్ మాట్లాడుతూ - ``మా నాన్నగారు, ఎన్టీఆర్‌గారు కలిసి రక్తసంబంధం సినిమా చేశారు. అందుకే మేం బాలకృష్ణగారిని అన్నయ్య అని పిలుస్తుంటాం. 30 ఏళ్ల ముందు బాలయ్యగారు ఎలా ఉన్నారో? ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. దక్షిణాదిన స్టార్స్ అయిన రజినీకాంత్, కమల్‌హాసన్, బాలకృష్ణ వంటి స్టార్స్‌తో సినిమాలు తీసి హిట్ కొట్టిన క్రెడిట్ కె.ఎస్.రవికుమార్‌గారికే దక్కుతుంది. కల్యాణ్‌గారు డిఫరెంట్ సినిమాలు చేసే ప్యాషన్ ఉన్న నిర్మాత. జైసింహా వంటి హిట్ తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తోన్న రూలర్ సినిమా బాక్సాఫీస్‌ను రూల్ చేస్తుంది`` అన్నారు.
నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ - ``రూలర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు`` అన్నారు.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ - ``సినిమా వాళ్లకి వైజాగ్, ఉత్తరాంధ్ర ప్రజలు ఇచ్చే సహకారాన్ని ఏ రోజు మరువలేం. ఎక్కడా చూడలేం. ఏ మాత్రం అవకాశం ఉన్నా ఇక్కడే షూటింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. దర్శకుడు కె.ఎస్.రవికుమార్‌గారు చాలా గొప్ప సినిమాలు చేశారు. ముఖ్యంగా ఆయన తమిళంలో చేసిన సినిమాలన్నీ మాలాంటి దర్శకులకు రెఫరెన్స్‌లా ఉపయోగపడుతు్నాయి. జైసింహా తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా సూపర్ డూపర్‌హిట్టవుతుంది. సి.కల్యాణ్‌గారికి అభినందనలు. రూలర్ అనే పేరు బాలయ్యబాబుకి పర్‌ఫెక్ట్‌గా సరిపోతుంది. ఈ సినిమా టైటిల్‌ను నేను రిజిష్టర్ చేసి, సాంగ్ కూడా చేసుకున్నాను. ఇప్పుడు ఆ టైటిల్ బాలయ్యబాబుగారికే దక్కింది. రూలర్ ఆఫ్ ఆర్ట్స్.. రూలర్ ఆఫ్ హార్ట్స్ బాలయ్య. ఆయన నటనతోనే నడవడికతోనూ అందరి మనసులు గెలుచుకున్నారు. ఆయన నటించిన రూలర్ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇందులో వర్క్ చేసిన నటీనటులు, టెక్నీషియన్స్‌కు థ్యాంక్స్`` అన్నారు.
డా.రాజశేఖర్ మాట్లాడుతూ - ``నేను ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత నాకు ఎక్కువ సపోర్ట్ అందించిన వ్యక్తి బాలకృష్ణగారే. ఆయన తండ్రి ఎన్టీఆర్‌గారు రూలర్. ఆయన కొడుగ్గా పెరిగిన బాలకృష్ణగారు రూలర్ అంటే ఏంటో తెలుసుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి రూలర్ అనే ఓ సినిమా చేస్తే ఎంత బావుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కె.ఎస్.రవికుమార్ అంటే సూపర్ డైరెక్టర్. చాలా ఫాస్ట్‌గా సినిమాలు తీసే డైరెక్టర్ ఆయన. కల్యాణ్‌గారితో సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి పరిచయం ఉంది. ఇంత మంది నాకు కావాల్సిన వ్యక్తులు చేసిన ఈసినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ - "బాలకృష్ణగారు మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఉండే వ్యక్తి. చిన్న పిల్లల మనస్తత్వంతో ఓపెన్‌గా ఉంటారు. గొప్ప మనసున్న వ్యక్తి. మంచి టైటిల్, డైరెక్టర్, నిర్మాత అన్ని చక్కగా కుదిరాయి. అందరికీ ఆల్ ది బెస్ట్" అన్నారు.
డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ మాట్లాడుతూ - `` జైసింహా తర్వాత మా కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ఇది. బాలయ్యగారికి, కల్యాణ్‌గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. పరుచూరి మురళిగారికి, మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్, రామజోగ్య శాస్త్రి, భాస్కర భట్ల, కెమెరామెన్ రాంప్రసాద్‌గారికి థ్యాంక్స్. ఎంటైర్ టీం ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఎంతగానో కష్టపడ్డారు. వేదిక, సోనాల్, జయసుధ, ప్రకాశ్‌రాజ్ సహా అందరికీ థ్యాంక్స్`` అన్నారు.
నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ - ``బాలకృష్ణగారితో కలిసి నేను, కె.ఎస్.రవికుమార్‌గారు పండగలాంటి సినిమా జైసింహాను ఇచ్చాం. రూలర్ సినిమా కూడా పండగలాంటి సినిమా. మీసం మెలేసి మాట్లాడేలా ఉంటుంది. అలాంటి సినిమాను బాలయ్యగారి కోసం, నా కోసం పరుచూరి మురళిగారు మాకు ఇచ్చారు. క్యాస్టింగ్, ఖర్చు ఎక్కువగా ఉండే ఈ సినిమాను 5 నెలల్లోనే రవికుమార్‌గారు పూర్తి చేశారు. సంక్రాంతి భోజనాన్ని 25 రోజుల ముందుగానే ఇస్తున్నాం. చిరంతన్ భట్‌గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఫైట్స్ ఇరగదీసేశారు. 5 నెలల్లో ఇంత టైట్ వర్క్‌ను పూర్తి చేయడమంటే మాటలు కాదు.. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను తమదిగా భావించి సినిమా చేశారు. పండగలాంటి సినిమా. సినిమా చూసిన తర్వాత బాలయ్య ఈజ్ గ్రేట్ అనేలా సినిమా ఉంటుంది`` అన్నారు.
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ - ``ఎన్టీఆర్, బసవతారకమ్మ పుణ్య దంపతుల కడుపున పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాన్నగారి బాటలో నడుస్తూ వైవిధ్యమైన పాత్రలు చేస్తూ వస్తున్నాను. ఆదిత్య 369, శ్రీరామరాజ్యం, గౌతమిపుత్రశాకర్ణి, మంగమ్మగారి మనవడు, ముద్దుల కృష్ణయ్య, సింహా, లెజెండ్ వంటి ఎన్నెన్నో పాత్రలను చేశాను. కళామతల్లికి సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించిన తెలుగు ప్రేక్షకులకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను. నేను ప్రయోగాత్మక పాత్రలు చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని ఆయన బాగా నమ్మారు. మనమే ముందు అడుగు వేయాలని ఆయన నమ్మారు. అది సినిమాలైన కావచ్చు.. రాజకీయాలైన కావచ్చు. అన్నింటినీ ప్రేక్షకులు ఆదరించారు. నేను, కల్యాణ్, కె.ఎస్.రవికుమార్ కలిసి చేసిన జైసింహా సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. ఆ స్ఫూర్తితోనే రూలర్ సినిమాను చేశాం. రూలర్ సినిమాకు మరో కథను అనుకున్నాం. కానీ అది కుదరలేదు. ఆ సమయంలో నేను పరుచూరి మురళిగారి ఫోన్ చేశాను. ఆయన దగ్గరున్న కథను వినిపించారు. నచ్చడంతో వెంటనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా, కొత్తదనం అందించాలనే ప్రయత్నాలు చేస్తుంటాను. నాకు రైతు మీద సినిమాలు చేయాలని చాలా కోరిక ఉండేది. ఓ సందర్భంలో చాలా మందిని కలిశాను కూడా. ఆ కోరిక అలాగే మిగిలిపోయింది. ఈసినిమాలో అది కొంత తీరింది. కె.ఎస్.రవికుమార్‌గారికి నాలానే సినిమా అంటే ప్రేమ. నాలుగు నెలల్లో ఈ సినిమాను పూర్తి చేశారు. చిరంతన్ భట్‌గారితో నేను చేస్తున్న మూడో సినిమా. అద్భుతమైన సంగీతాన్ని అందించారు. రీరికార్డింగ్‌ను కూడా చక్కగా అందించి పాత్రను మరో లెవల్‌కు తీసుకెళ్లారు. కెమెరామెన్ సన్నివేశాలను అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించారు. వేదిక, సోనాల్ చౌహాన్ చక్కగా నటించారు. పైట్ మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్, పాటలు రాసిన రామజోగయ్యగారు, భాస్కరభట్లగారికి అభినందనలు. నటీనటులైన భూమికగారు, జయసుధగారు, ప్రకాష్‌రాజ్‌గారు సహా అందరి కష్టంతోనే సినిమాను నాలుగు నెలల్లోనే పూర్తి చేశారు. తప్పకుండా సినిమా అందరినీ మెప్పించేలా ఉంటుంది`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com