బాలయ్య అల్లుడికి భయం భయం.. జోష్లో జనసేన!
- IndiaGlitz, [Thursday,April 18 2019]
అవును మీరు వింటున్నది నిజమే.. నందమూరి బాలయ్య చిన్నల్లుడు భరత్ విశాఖ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. పోటీ అయితే చేశారు కానీ గెలుస్తామన్న ధీమా మాత్రం ఆయనలో లేదట. ఇందుకు కారణాలు బోలెడన్ని ఉన్నాయట. అసలు భరత్ ఎందుకు భయపడుతున్నాడు..? జనసేనలో జోష్ ఎలా వచ్చింది..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
అటు సొంతిట.. ఇటు మామ ఇంట ఫుల్ పొలిటికల్ బ్రాగ్రౌండ్తో శ్రీ భరత్ అరంగేట్రం చేశారు. ఫస్ట్ టైమ్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన భరత్.. పార్లమెంట్లో ‘భరత్ అనే నేను’ అనే యోగం లేనట్లేనని తాజాగా తేలిపోయిందట. విశాఖ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో చాలా వరకు టీడీపీకే ఓట్లు పడినప్పటికీ ఎంపీకి మాత్రం పెద్దగా వేయలేదట. ఒక్క మాటలో చెప్పాలంటే క్రాస్ ఓటింగ్ జరిగిందన్న మాట.
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు కార్యకర్తలు, అభిమానులు ఓటేసి.. ఎంపీకి మాత్రం పెద్దగా ఓటేయలేదట. పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ పడిందట. దీంతో ఓట్లన్నీ ఇదే నియోజకవర్గం నుంచి జనసేన తరఫున పోటీ చేసిన మాజీ జేడీ లక్ష్మీ నారాయణకు పడ్డాయట. దీంతో బాలయ్య అల్లుడికి భయం పట్టుకుందట. ఈ విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు, పవన్, మాజీ జేడీ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారట.
సో.. ఈ లెక్కన చూస్తే తన ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చి మరీ రాజకీయాల్లోకి వచ్చిన మాజీ జేడీ గెలవబోతున్నారన్న మాట. ఇది విశాఖలో వస్తున్న పుకార్లు మాత్రమే. ఫైనల్ ఫలితం తేలాలంటే మే-23 వరకు వేచి చూడాల్సిందే మరి.