మళ్లీ చేతికి పని చెప్పిన బాలయ్య.. టచ్‌తో హ్యాపీ అంటున్న యువకుడు
Send us your feedback to audioarticles@vaarta.com
అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ యువకుడిపై చేయి చేసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. బాలయ్యకు ఇది కొత్తేమీ కాదు.. పలు సందర్భాల్లోనూ ఇలాగే చేతికి పని చెప్పారు. బాలయ్య ఒకరకంగా ఈ ఒక్క విషయంలోనే బ్యాడ్ అవుతున్నారు. యాంగర్ మేనేజ్మెంట్ అనేది అసలు బాలయ్యకు లేదంటూ ప్రత్యర్థి పార్టీలు ఆయన వీడియోలను వైరల్ చేస్తున్నారు. నేడు ఓ యువకుడిని కొట్టిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
అయితే ఈ ఘటనపై బాలయ్య చేతిలో దెబ్బలు తిన్న యువకుడు స్పందించాడు. బాలయ్య బాబు తనను టచ్ చేసినందుకు గర్వంగా ఉందంటూ సదరు యువకుడు ఓ వీడియోను విడుదల చేశాడు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలకృష్ణ తమ అన్నయ్య ఇంటికి వచ్చారని.. అయితే తానెవరో తెలియక బయటి వ్యక్తి అనుకుని తనను పక్కకు తోసేశారని తెలిపాడు. ఇలాంటి వాటిని బాలయ్య ఫ్యాన్స్ అయిన తాము అసలు పట్టించుకోమని తెలిపాడు. ప్రత్యర్థులు దీనిని రాజకీయ కోణంలో చూస్తే వాళ్లంత మూర్ఖులు మరొకరు ఉండరని తెలిపాడు.
‘‘నా పేరు సోము. నేను బాలయ్య బాబుగారి వీరాభిమానిని. బాలయ్య బాబు గారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం నుంచి రాత్రి వరకు విరామం లేకుండా శ్రమిస్తున్నారు. ప్రచారంలో భాగంగా బాలకృష్ణ మా అన్నయ్య ఇంటికి వచ్చారు. నేను ఎవరో తెలియక బయట వ్యక్తి అనుకుని నన్ను పక్కకు తోశారు. అయినా ఇలాంటి వాటిని మాలాంటి ఎన్బీకే ఫ్యాన్స్ పట్టించుకోము. ప్రత్యర్థులు దీన్ని రాజకీయ కోణంలో చూస్తే వాళ్లంతటి మూర్ఖులు ఇంకెవరూ ఉండరు. ఇంకో విషయం ఏంటంటే.. ఈ రోజు ప్రచారంలో బాలయ్య బాబు గారు ఎవరికి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అలాంటిది ఈ రోజు నన్ను ఆయన టచ్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బాలయ్య బాబుగారు నన్ను టచ్ చేశారని నేను గర్వంగా చెప్పుకుంటున్నా. జై బాలయ్య. జై తెలుగుదేశం’’ అంటూ ఆ వీడియోలో యువకుడు వెల్లడించాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com