కరోనా వ్యాక్సిన్ గురించి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
మార్చి ముందు వరకు ప్రపంచంలో మనిషి చాలా స్వేచ్ఛగా తిరిగాడు. కానీ.. మార్చి నుండి పరిస్థితి మారిపోయింది. కరోనా వైరస్ .. మహమ్మారిగా మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆరేడు నెలలుగా మనుషులు భయంభయంగానే బయటకు వస్తున్నారు. ఈ వైరస్ దెబ్బకు మాస్కులు, శానిటైజర్స్ వాడకం తప్పని సరిగా మారిపోయింది. ఈ వైరస్ నివారణకు ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సిన్‌ను కనుగొనే పనిలో బిజీ బిజీగా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో సెహరి అనే సినిమా ఫస్ట్‌లుక్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బాలకృష్ణ కరోనా వ్యాక్సిన్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కరోనాకు వ్యాక్సిన్ రాలేదు.. రాదు కూడా అని బాలయ్య అన్నారు. కరోనాతో జీవితాంతం కలిసి ప్రయాణించాల్సిందేనని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
భక్తి ఛానెల్స్‌లో వచ్చే ఆధ్యాత్మిక వేత్తలు మాటలు విని, ఈ సమయంలో చల్లటి నీళ్లతో స్నానం చేయవద్దని, ఎందుకంటే కరోనా అనేది నిమోనియాకు సంబంధించినదని, చల్లటి నీళ్లతో స్నానం చేస్తే అది ప్రమాదకరమని ఆయన అన్నారు. కరోనా వెళ్లడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి తగు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని, శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాలని బాలయ్య పేర్కొన్నారు. ప్రపంచంలోని శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ కనుగొనడానికి చాలా శ్రమ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments