చివరి రక్తపుబొట్టు వరకు ప్రజాసేవే.. ఇప్తార్ విందులో బాలయ్య
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం నుంచి వరుసగా రెండు సార్లు గెలిచి నిలిచిన ఎమ్మెల్యే బాలయ్య ముస్లిం సోదరులకు ఇపఫ్తార్ విందు ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం హిందూపురంలోని ఆల్హిలాల్ షాదీఖానాలో విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు నియోజకవర్గంలోని పలువురు ముస్లిం పెద్దలు, అహుడా చైర్మన్ అబికా లక్ష్మీనారాయణతో పాటు పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు, బాలయ్య అభిమానులు తరలివచ్చారు.
ఈ సందర్భంగా కార్యక్రమంలో బాలయ్య మాట్లాడుతూ.. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైందని.. కఠోర ఉపవాస దీక్షలతో ముస్లింలు భక్తిని చాటుకునే పండుగే రంజాన్ అన్నారు. "నా చివరి రక్తపుబొట్టు వరకు ప్రజాసేవ చేస్తాను. హిందూపురం అభివృద్ధికి కృషి చేస్తాను. రంజాన్ తోఫా, దుల్హన్, మసీదుల్లో మౌలానా, మౌజాన్లకు గౌరవవేతనం, హజ్భవనాల నిర్మాణం, వాటి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులిచ్చిన ఘనత చంద్రబాబుదే. తెలుగుదేశం ఆవిర్భావం నాటి నుంచి హిందూపురంలో పార్టీని గెలిపిస్తూ మా కుటుంబాన్ని ఆదరిస్తున్నారు. ఈ ప్రాంత ప్రజల ఆదరాభిమానాలు ఎన్నటికీ మరువలేము. ఈ ఎన్నికల్లో ఇంతటి విజయం అందించిన హిందూపురం ప్రజలకు రుణపడి ఉంటాను" అని బాలయ్య చెప్పుకొచ్చారు. బాలయ్య మాట్లాడుతున్నంత సేపు అభిమానులు, కార్యకర్తలు ఈలలు, కేకలు, జై బాలయ్య.. జైజై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments