కంట్రోల్ తప్పుతున్న బాలయ్య..
Send us your feedback to audioarticles@vaarta.com
బాలకృష్ణ ఈమధ్య మీడియా ముందు మాట్లాడుతున్నాం అనే విషయాన్నిమరచిపోయి తనకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి వార్తల్లో నిలుస్తున్నారు. మొన్న లేపాక్షి ఉత్సవాల సమయంలో విజయవాడలో మీడియా సవేశంలో ఓ జర్నలిస్ట్...లేపాక్షి ఉత్సవాలకు చిరంజీవిని పిలివలేదా అని అడిగితే...నా నెత్తిన ఎక్కి కూర్చొనే వాళ్ళను పిలవను అని చెప్పి చిరంజీవి పై సెటైర్ వేసారు. చిరు - బాలయ్య ఇద్దరూ మంచి మిత్రులు. వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. మరి.. ఉన్నట్టుండి బాలయ్య చిరు గురించి ఎందుకిలా మాట్లాడారనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
అలాగే ఇటీవల జి.హెచ్.ఎం.సి ఎన్నికల రోజు ఓటు వేసిన అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడే ముందు కెమెరామెన్స్ తో ఉండాలా..దె...లా అనే బూతు మాట మాట్లాడి అక్కడున్నవారికి షాక్ ఇచ్చాడు. తాజాగా నారా రోహిత్ నటించిన సావిత్రి ఆడియో వేడుకకు బాలయ్య ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ వేడుకలో బాలయ్య మాట్లాడుతూ...నేను అమ్మాయి వెనకాల పడే పాత్ర చేస్తే మా అభిమానులు ఒప్పుకోరు...ముద్దాడాలి...లేకపోతే కడుపు చేయాలి అంతే అంటూ తనదైన శైలిలో నవ్వాడు. ఎవరు ఊహించని విధంగా బాలయ్య ఇలా మాట్లాడడంతో ఒక్కసారిగా షాక్ అయి ఆతర్వాత నవ్వడం ప్రారంభించారు.
బాలయ్య అక్కడితే ఆగలేదు..నేను ఎక్కని ఎత్తులు లేవు...చూడని లోతులు లేవు అంటూ అక్కడున్న వారికి ఇంకో షాక్ ఇచ్చాడు. అక్కడున్న హీరోయిన్స్ శ్రద్దాదాస్ - నందితలకు ఎలాంటి ఎక్స్ ప్రెషన్ ఇవ్వాలో తెలియని పరిస్థితి. మొత్తానికి బాలయ్య ఈమధ్య బాగా...కంట్రోల్ తప్పి కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిపోతున్నాడు. మరి...ఈ విషయాన్ని ఎప్పుడు తెలుసుకుంటాడో...? మాటల పొదుపుతో అదుపు తప్పకుండా ఎప్పుడు మాట్లాడతాడో...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments