సంక్రాంతి వేడుకల్లో బాలయ్య..!
Send us your feedback to audioarticles@vaarta.com
గౌతమీపుత్ర శాతకర్ణి విజయం సాధించడంతో బాలయ్య సంతోషంతో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని కొమరవోలు, నిమ్మకూరులో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొని నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతుల విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఇక్కడ నుంచి బాలయ్య ఎండ్ల బండి పై స్వగ్రామానికి వెళ్లి చిన్నారులకు భోగిపళ్లు పోసి, ధాన్యం రాశులకు పూజలు చేసి రైతులను సన్మానించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... సంక్రాంతికి స్వగ్రామానికి రావడం సంతోషంగా ఉంది. గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాన్ని ఆదరిస్తున్న అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. చారిత్రాత్మక కథతో రూపొందిన ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వడం శుభపరిణామం. ఈ సందర్భంగా మరోసారి ఇద్దరు ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments