చిరు పై సెటైర్ వేసిన బాలయ్య..
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ లేపాక్షి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయవాడు లో మీడియాతో మాట్లాడిన బాలయ్యను లేపాక్షి ఉత్సవాలకు చిరంజీవిని పిలవలేదా అని జర్నలిస్ట్ లు అడగితే...ఇండస్ట్రీలో ఎవర్ని పిలవాలో వాళ్లనే పిలిచాను. నేను ఎవర్ని నెత్తిన ఎక్కించుకుని కూర్చోబెట్టను. ఎవర్ని పిలవాలో వాళ్లనే పిలుస్తాను. పిలిస్తే వచ్చే వాళ్లు ఉంటారు. కానీ...నేను నా పద్దతిలో అదే డిక్టేటర్ పద్దతిలో వెళతా అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.
బాలయ్య మాటలను బట్టి...చిరుకి చనువు ఇస్తే నెత్తిన ఎక్కి కూర్చుంటారని బాలయ్య అభిప్రాయం. మరి...బాలయ్య బావ చంద్రబాబు చిరు తమ్ముడు పవన్ ని నెత్తిన ఎక్కించుకున్నారని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు పవన్ ని నెత్తిన ఎక్కించుకున్నారని బాబు పై కోపమా...? లేక చిరుకి చనువిస్తే నెత్తిన కూర్చుంటాడని చిరు పై కోపమా..? ఏమిటో బాలయ్య మాటల్లో మర్మమేమిటో బాలయ్యకే తెలియాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments