ఆలోచనలో పడ్డ బాలయ్య...

  • IndiaGlitz, [Tuesday,February 09 2016]

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ వందో సినిమాను సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. బాల‌య్య‌, సింగీతం కాంబినేష‌న‌లో రూపొందిన ఆదిత్య 369 మూవీకి సీక్వెల్ గా ఆదిత్య 999 మూవీ ప్లాన్ చేసారు. బాల‌య్య పుట్టిన‌రోజైన జూన్ 10న ఈ సినిమా ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే బాల‌కృష్ణ వందో సినిమా ప్ర‌క‌టించ‌గానే...బాల‌య్య‌కు అభిమానుల నుంచి ఒత్త‌డి ఎక్కువైంద‌ట‌.
వందో సినిమా మాస్ మూవీ చేస్తే బాగుంటుంది అంటున్నార‌ట‌. అదీ కూడా యంగ్ డైరెక్ట‌ర్ తో అయితే ఇంకా బాగుంటుంద‌ని చెప్పార‌ట‌. దీంతో బాల‌య్య ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ట‌. అభిమానుల కోరిక మేర‌కు వందో సినిమా మాస్ మూవీ చేసి...సింగీతంతో ప్లాన్ చేసిన ఆదిత్య 999 మూవీని 101 వ సినిమాగా చేస్తే ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట బాల‌య్య‌. ఈ విష‌యం పై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటార‌ట‌. మ‌రి...ఏ నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

More News

పిరికివాడు త‌న ప్రేమ‌ను ఎలా గెలుచుకున్నాడ‌నేదే కృష్ణ గాడి వీర ప్రేమ గాథ - హీరో నాని

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, భ‌లే భ‌లే మ‌గాడివోయ్...చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు సాధించిన యంగ్ హీరో నాని న‌టించిన తాజా చిత్రం కృష్ణ గాడి వీర ప్రేమ గాథ‌.

నాని క‌థ అలా పుట్టింద‌ట‌

నాని హీరోగా హ‌నురాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాథ చిత్రం ఫిభ్ర‌వ‌రి 12న విడుద‌ల‌కానుంది.

రేపే చరణ్ మూవీ ప్రారంభం..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రూస్ లీ ఫ్లాప్ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్నారు.తమిళ మూవీ తని ఓరువన్ రీమేక్ లో చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే.

రవితేజతో మళ్ళీ...

బెంగాల్ టైగర్ తర్వాత మాస్ మహారాజా రవితేజ వెంటనే సినిమా చేయలేదు.

కొత్త టైటిల్ రిజిష్టర్ చేసిన నాగ్..

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. సంక్రాంతికి రిలీజైన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం నాగ్ కెరీర్ లోనే నెం 1 చిత్రంగా నిలిచింది.