టాలీవుడ్ పెద్దలు.. బాలయ్యకు ఒక్క మాట కూడా చెప్పలేదా!?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగ్స్, రిలీజ్లు, థియేటర్స్ తిరిగి ప్రారంభింపజేయాలని టాలీవుడ్ పెద్దలు నానా తంటాలే పడుతున్నారు. ఇప్పటికే తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా షూటింగ్స్‌కు అనుమతివ్వగా.. థియేటర్స్ ఎప్పట్నుంచి ప్రారంభం అవుతాయనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కాగా ఈ షూటింగ్స్ వ్యవహారమై ఇదివరకే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో కీలక భేటీ జరిగింది. ఈ భేటీకి అక్కినేని నాగార్జునతో పాటు పలువురు దర్శకులు, నిర్మాతలు హాజరయ్యారు. ఆ తర్వాత మెగాస్టార్‌తో పాటు పలువురు పెద్దలు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కూడా కలిశారు.
ఒక్క మాటైనా చెప్పలేదేం!?
అయితే ఇంత జరుగుతున్నా సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణకు మాత్రం ఒక్క మాట కూడా చెప్పలేదా..? ఒక్క మాటైనా బాలయ్యకు చెప్పలేదా..? అసలు బాలయ్యను పెద్దలు పట్టించుకోనే లేదా..? అంటే తాజాగా ఆయన మాటలను బట్టి చూస్తే ఇదే అక్షరాలా నిజమనిపిస్తోంది. దివంగత నటుడు, ముఖ్యమంత్రి, ఆంధ్రుల ఆరాధ్యుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలయ్య మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియా ప్రతినిధులు షూటింగ్స్, సినిమా రిలీజ్‌ల గురించి ప్రస్తావన తీసుకురాగా అవునా అన్నంతగా ఆశ్చర్యపోతూ మాట్లాడారు.
నాకు తెలియదు..!
‘సినిమా షూటింగ్స్‌లు ప్రారంభించే విషయంపై సినీ పెద్దలతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్న విషయం నాకు తెలియదు. ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్న విషయం పత్రికల్లో వార్తలు చూసి మాత్రమే తెలుసుకున్నాను. సినిమా షూటింగ్స్ వీలైనంత త్వరగా మెదలు పెట్టాలని కోరుకుంటున్నాను. జూన్ రెండు, లేదా మూడో వారంలో షూటింగ్స్ ప్రారంభం అవుతాయని అనుకుంటున్నాను. షూటింగ్‌ల కోసం ప్రభుత్వం ప్రత్యేక జీవోను తీసుకురావాలి. ఎక్కువ శాతం షూటింగ్‌లు ప్రారంభమైన చిత్రాలకు త్వరగా అనుమతి ఇవ్వాలి. సినీ కార్మికులు సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. షూటింగ్ సమయంలో సామాజిక దూరం పాటించాలి. అని బాలయ్య సూచించారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడిన ఆయన.. నాన్నగారిలా అందరూ మహానుభావులు కాలేరని బాలయ్య చెప్పుకొచ్చారు. బాలయ్య వ్యాఖ్యలపై టాలీవుడ్ పెద్దలు మరీ ముఖ్యంగా మెగాస్టార్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout