వివాదంపై స్పందించని బాలయ్య..
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ ఏడాది ఏపీ ప్రభుత్వం 2014, 2015, 2016 ఏడాదులకుగానూ నంది అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిపై పెద్ద వివాదమే చేలరేగింది. ముఖ్యంగా 2014లో ప్రకటించిన నంది అవార్డుల్లో లెజెండ్ చిత్రానికి తొమ్మిది అవార్డులు రావడం పెద్ద వివాదం అయ్యింది. పలువురు సినీ ప్రముఖులు పలు రకాలుగా నంది అవార్డులుపై స్పందిస్తున్నారు.
రీసెంట్గా ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని నందమూరి బాలకృష్ణ సందర్శించినప్పుడు మీడియా ప్రతినిధులు నంది అవార్డులపై స్పందన అడిగారు. బాలయ్య మాట్లాడుతూ "లెజెండ్ సినిమాకు తొమ్మిది అవార్డులు రావడం ఆనందంగా ఉంది. మీ అందరికీ తెలుసు..లెజెండ్ పదంపై ఎంతటి వివాదం నెలకొందో..మా సినిమా మాటలతో కాదు..చేతలతో సమాధానం చెప్పింది.
మా సక్సెస్‌కు టీం కృషే కారణం. అలాగే మిగతా ఏడాదుల్లో అవార్డులు సాధించిన కళాకారులకు నా అభినందనలు" అన్నారు. అయితే ప్రస్తుతం నంది అవార్డులపై రేగుతున్న వివాదాలపై మాత్రం స్పందించలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com