వివాదంపై స్పందించ‌ని బాల‌య్య‌..

  • IndiaGlitz, [Sunday,November 19 2017]

ఈ ఏడాది ఏపీ ప్ర‌భుత్వం 2014, 2015, 2016 ఏడాదుల‌కుగానూ నంది అవార్డుల‌ను ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. వీటిపై పెద్ద వివాద‌మే చేల‌రేగింది. ముఖ్యంగా 2014లో ప్ర‌క‌టించిన నంది అవార్డుల్లో లెజెండ్ చిత్రానికి తొమ్మిది అవార్డులు రావ‌డం పెద్ద వివాదం అయ్యింది. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు పలు ర‌కాలుగా నంది అవార్డులుపై స్పందిస్తున్నారు.

రీసెంట్‌గా ఎన్టీఆర్ ట్ర‌స్ట్ నిర్వ‌హించిన ర‌క్త‌దాన శిబిరాన్ని నంద‌మూరి బాల‌కృష్ణ సంద‌ర్శించిన‌ప్పుడు మీడియా ప్ర‌తినిధులు నంది అవార్డుల‌పై స్పంద‌న అడిగారు. బాల‌య్య మాట్లాడుతూ "లెజెండ్ సినిమాకు తొమ్మిది అవార్డులు రావ‌డం ఆనందంగా ఉంది. మీ అంద‌రికీ తెలుసు..లెజెండ్ ప‌దంపై ఎంత‌టి వివాదం నెల‌కొందో..మా సినిమా మాట‌ల‌తో కాదు..చేత‌ల‌తో స‌మాధానం చెప్పింది.

మా స‌క్సెస్‌కు టీం కృషే కార‌ణం. అలాగే మిగ‌తా ఏడాదుల్లో అవార్డులు సాధించిన క‌ళాకారుల‌కు నా అభినంద‌నలు" అన్నారు. అయితే ప్ర‌స్తుతం నంది అవార్డుల‌పై రేగుతున్న వివాదాల‌పై మాత్రం స్పందించ‌లేదు.

More News

సంక్రాంతికి విక్ర‌మ్ 'స్కెచ్‌'

'అపరిచితుడు' సినిమాతో తెలుగు ఇండస్ట్రీని, తెలుగు మార్కెట్ ని తన వైపు తిప్పుకున్న హీరో విక్రమ్. ఈ సినిమా తర్వాత విక్రమ్ సినిమాలు డబ్ చేయడం, రీమేక్ చేయడం కూడా జరుగుతోంది.

కిక్ బాక్సర్ గా అల్లు అర్జున్ ?

క్రీడా నేపధ్యంలో చాలా సినిమాలే వచ్చాయి, వస్తున్నాయి. అలా వచ్చిన సినిమాలన్నీ సదరు హీరోలకి, దర్శకులకి హిట్స్ ను అందించాయి.

మ‌రిన్ని మంచి పాత్ర‌ల‌తో అల‌రిస్తా - స‌మంత‌

'ఏం మాయ చేసావే' సినిమాతో తెరంగేట్రం చేసిన హీరోయిన్ సమంత. గ్లామర్ రోల్స్ తో పాటు అవకాశం వచ్చినప్పుడల్లా పెర్ఫార్మన్స్ బేస్డ్ రోల్స్ కూడా చేస్తోంది సామ్.

5 నెల‌ల మెగా సంద‌డి

మెగాఫాన్స్ కి 2017 మిక్స్‌డ్ ఇయ‌ర్‌గానే చెప్పొచ్చు. ఈ సంవ‌త్స‌రం మెగా క‌థానాయ‌కులు న‌టించిన చిత్రాల్లో 'ఖైదీ నంబర్ 150', 'ఫిదా' మూవీస్ మాత్రమే బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని అందుకోగలిగాయి.

విల‌న్ కావాల‌నే ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను - చ‌ర‌ణ్‌దీప్‌

'పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18 ఎం' సినిమా గురించి విన‌ప‌డుతున్న వార్త‌లు. సినీ ప్రేక్ష‌కులే కాదు. సినీ ప్ర‌ముఖులు, స్టార్ హీరోలు..ఇలా సినిమా చూసిన వారంద‌రూ సినిమా అద్భుతంగా ఉంద‌ని అప్రిసియేట్ చేస్తున్నారు.