అభిమానుల‌కు బాల‌కృష్ణ విజ్ఞ‌ప్తి

  • IndiaGlitz, [Tuesday,June 09 2020]

నంద‌మూరి బాల‌కృష్ణ 60వ పుట్టిన‌రోజు జూన్ 10. నంద‌మూరి అభిమానులు ఈ వేడుక‌ల‌ను ఓ పండుగ‌లా నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది ష‌ష్టి పూర్తి పుట్టిన‌రోజు కావ‌డంతో బాల‌య్య అభిమానులు ఘ‌నంగా సెల‌బ్రేట్ చేద్దామ‌ని అనుకున్నారు. కానీ బాల‌కృష్ణ త‌న అభిమానుల‌కు విజ్ఞ‌ప్తి చేస్తూ ఓ లేఖ రాశారు.

‘‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నా అభిమాన సోదరులందరికీ నా ఆత్మీయ విజ్ఞ‌ప్తి. నా 60వ పుట్టిన‌రోజుని మీ ఇంటి పండుగ‌లా క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో సంబ‌రాలు చేస్తున్న మీ అంద‌రికీ నా హృద‌య పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు. నా హితులు, శ్రేయోభిలాషులు కుటుంబ స‌భ్యులైన మీ అంద‌రితో క‌లిసి వేడుక చేసుకొనే అదృష్టానికి అంత‌రాయం ఏర్ప‌డినందుకు బాధ‌గా ఉంది. ఈ క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న స‌మ‌యంలో మీ అంద‌రి ఆరోగ్యం గురించి ఆలోచించ‌డం నా బాధ్య‌త‌. మీ క్షేమ‌మే నాకు కొండంత ఆశీర్వాదం. ప్ర‌భుత్వం నిబంధ‌న‌లు, ఆంక్ష‌లు, భౌతిక దూరం పాటించ‌డం మనంద‌రి క‌ర్త‌వ్యం. అందుకే అంద‌రినీ క‌ల‌వాల‌న్న నా ఆకాంక్ష ఆడ్డుక‌ట్ట వేసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ద‌య‌చేసి ఎవ‌రూ మీ ఆరోగ్యాన్ని నిర్ల‌క్యం చేసి న‌న్ను క‌ల‌వ‌డానికి ఎవ‌రూ రావ‌ద్ద‌ని కోరుతున్నాను. ద్వారకా క్రియేష‌న్స్, బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో నేను చేస్తున్న సినిమా టీజ‌ర్‌, నేను పాడిన పాట విడుద‌ల అవుతున్నాయి. ఆస్వాదించండి.. ఆశీర్వ‌దించండి.

ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు పాటించండి. నిండు మ‌న‌సుతో నా విన్న‌పాన్ని మ‌న్నించండి. మీ బ్ర‌తుల‌కు ముఖ్యం.. మీ భ‌విత ముఖ్యం. మీ అంద‌రి క్షేమ‌మే మీరు నాకు ఇచ్చే అద్భుత‌మైన ఆశీర్వాదం. నా విన్న‌పాన్ని మ‌న్నిస్తార‌ని ఆశిస్తున్నాను’’ అని తెలిపారు నంద‌మూరి బాల‌కృష్ణ‌.

More News

వై.ఎస్‌.జ‌గ‌న్‌తో ముగిసిన సినీ పెద్ద‌ల బేటీ... విశేషాలు

సినిమా షూటింగ్స్‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చినందుకు ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్‌ను క‌లిసిన సినీ ప్ర‌ముఖులు చిరంజీవి, అక్కినేని నాగార్జున‌, డి.సురేష్‌బాబు,

స్పెష‌ల్ సాంగ్స్ చేయ‌డానికి ఇబ్బందేమీ లేదు:  త‌మ‌న్నా

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇంటికే ప‌రిమిత‌మైంది.

హార్ట్ ఆపరేషన్ జరిగింది.. నేను క్షేమమే! : శశి ప్రీతమ్

సంగీత దర్శకుడు శశి ప్రీతమ్ తాను క్షేమంగా ఉన్నానని తెలిపారు. ఈ నెల 4న ఆయనకు హార్ట్ ఆపరేషన్ జరిగింది. ఈ రోజు (మంగళవారం) డిశ్చార్చ్ అవుతున్నారు.

రేవంత్ రెడ్డి వ్యవహారం : ఇది నా తప్పే సరిచేసుకుంటా!

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర విమర్శలు గుప్పించారని సోషల్ మీడియాలో, యూ ట్యూబ్ చానెల్స్‌లో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

ఏపీ-తెలంగాణల మధ్య చెక్ పోస్టులు ఎత్తేయలేదు..!

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 5.0 విధించిన విషయం విదితమే. ఇందులో భాగంగా అంతర్ రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతులు ఉన్నాయి.