సినారె సేవలు చిరస్మరణీయం! - నందమూరి బాలకృష్ణ
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు భాషకు సి. నారాయణరెడ్డిగారు చేసిన సేవలు చిరస్మరణీయం. మా నాన్నగారు స్వర్గీయ తారక రామారావుగారి ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన, నాన్నగారి ద్వారానే సాంస్కృతికంగా పలు శాఖలకు సారథ్యం వహించి తెలుగు భాషకు పలు సేవలందించారు. పండితుల నుంచి పామరుల వరకు అందరినీ ఏకకాలంలో మెప్పించగలిగే సాహిత్యాన్ని అందించి తెలుగు సినిమా పాట గౌరవాన్ని ఇనుమడింపజేశారు. నేను నటించిన ఎన్నో సినిమాలకు కూడా ఆయన పాటలను రాశారు. ఆయన కన్నుమూశారని తెలిసి తీరని బాధ కలిగింది. సాహితీ లోకానికి ఆయన లేని లోటు తీర్చలేనిది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com