బాల‌య్య వ‌ద్దంటే.. వెంకీ ఎస్ చెప్పాడా

  • IndiaGlitz, [Sunday,December 30 2018]

స్టార్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ చాలా కాలంగా సినిమా చేయ‌కుండా ఉన్నాడు. నిజానికి బాల‌కృష్ణ హీరోగా వినాయ‌క్ సినిమా చేయాల్సింది. కానీ చాలా కాలంగా వినాయ‌క్ బాల‌య్య సిగ్న‌ల్ కోసం వెయిట్ చేశాడు. అయితే బాల‌య్య త‌న త‌దుప‌రి సినిమాపై క్లారిటీ ఇచ్చేశాడు.

బోయ‌పాటితో బాల‌య్య సినిమా చేయ‌బోతున్నాడు. దీంతో వినాయ‌క్ నెక్స్‌ట్ వెంక‌టేశ్‌ను సంప్ర‌దించాడ‌ట‌. వెంకీ సినిమా చేయ‌డానికి ఎస్ చెప్పాడట‌. గ‌తంలో వీరి కాంబోలో ల‌క్ష్మీ సినిమా చాలా పెద్ద హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. అంతా ఓకే అయితే వీరి కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా త్వ‌ర‌లోనే అధికారికంగా అనౌన్స్ అవుతుంది.