మరో సినిమాకు సిద్ధమవుతున్న బాలయ్య..?

  • IndiaGlitz, [Tuesday,January 07 2020]

నంద‌మూరి బాల‌కృష్ణ స్పీడు మామూలుగా లేదు!. ఆయ‌న తోటి సీనియ‌ర్ హీరోలంద‌రూ ఒక సినిమా చేయ‌డానికి ముందు వెనుక ఆలోచిస్తుంటే బాల‌య్య మాత్రం ఏక‌ధాటిగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ప్ర‌స్తుతం ఈయ‌న బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌బోయే హ్యాట్రిక్ మూవీ కోసం సిద్ధ‌మ‌వుతున్నాడు. లేటెస్ట్ స‌మాచారం బోయపాటితో సినిమా సెట్స్‌కు వెళ్ల‌క‌ముందే మ‌రో సినిమా కోసం క‌థ‌ను సిద్ధం చేసుకుంటున్నార‌ట‌. ఇటీవ‌ల ఓ రైట‌ర్ చెప్పిన క‌థ బాల‌య్య‌కు బాగా న‌చ్చింద‌ట‌. ఈ సినిమాకు ఎవ‌రిని డైరెక్ట‌ర్‌గా తీసుకోవాల‌ని ఆలోచ‌న వ‌చ్చిన‌ప్పుడు మాత్రం బాల‌కృష్ణ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ బి.గోపాల్ పేరుని స‌జెస్ట్ చేశార‌ట‌.

బాల‌కృష్ణ‌తో లారీ డ్రైవ‌ర్‌, రౌడీ ఇన్‌స్పెక్ట‌ర్‌, స‌మ‌ర సింహారెడ్డి, న‌రసింహ‌నాయ‌డు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను బి.గోపాల్ తెరకెక్కించారు. అయితే ప్ర‌స్తుతం ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా బాల‌కృష్ణతో సినిమా చేయ‌డం బి.గోపాల్‌కు సాధ్య‌మ‌వుతుందా? అనేది ఆలోచించాలి. అయితే బాల‌కృష్ణ మాత్రం చాలా న‌మ్మ‌కంగా ముందుకెళ్లిపోతున్నాడ‌ట‌. ఇప్ప‌టికే క‌థా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని టాక్‌. కొన్ని రోజుల్లో ఈ సినిమా ప‌రంగా ఓ క్లారిటీ రానుంది. ఈలోపు బాల‌కృష్ణ త‌న 106వ సినిమాను బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో పూర్తి చేసేస్తాడు. వెంట‌నే నెక్ట్స్ మూవీకి సిద్ధ‌మైపోతాడ‌ట‌.