మోక్షజ్ఞను లాంచ్ చేయనున్న జక్కన్న... ఎంట్రీ ఆలస్యానికి కారణం ఇదేనా?

  • IndiaGlitz, [Saturday,December 21 2019]

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఆ శుభముహూర్తం కోసం బాలయ్య అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తూనే ఉన్నారు. దీనిపై మూడేళ్లుగా చర్చ జరుగుతున్నా... ఎప్పుడు? ఏంటి? అనేది ఇంకా కన్ ఫాం కాలేదు. గతేడాది డైరెక్టర్ క్రిష్ తో మోక్షజ్ఞ ఇంట్రడ్యూస్ అవుతాడని వార్తలు వచ్చినా... అది నిజం కాలేదు. పైగా మోక్షజ్ఞ బరువు కూడా పెరిగాడని... ఇక బాలయ్య వారసత్వం కొనసాగడం కష్టమే అనుకున్నారు అంతా.

అయితే తాజాగా కుమారుడి సినీ రంగ ప్రవేశంపై స్పందించారు బాలయ్య. మోక్షజ్ఞ చదువుకునే రోజుల్లో పూర్తిగా చదువుపైనే దృష్టిపెట్టాడని.. ప్రస్తుతం సినిమాల గురించి ఆలోచిస్తున్నాడని స్పష్టం చేశారు. ఖచ్చితంగా మోక్షజ్ఞను తెరపై చూస్తారన్నారు. దీంతో అభిమానుల్లో అంతులేని ఆనందం నెలకొంది. ఇది సరే .. మరీ ఎంట్రీ ఎందుకు లేట్ అవుతుందనే దానిపై మరో వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తుంది.

మోక్షజ్ఞను లాంచ్ చేసేందుకు జక్కన్నే కరెక్ట్ అని బాలయ్య భావించమే తనయుడి సినీ రంగ ప్రవేశానికి ఆలస్యం అవుతుందని సమాచారం. ఈ ఏడాది రాజమౌళితో సినిమా చేయించాలని ప్రయత్నించినా... అది సఫలం కాలేదు. ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న రాజమౌళి మరో ఏడాది గడిస్తేనే ఫ్రీ అవుతాడు. అప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని... అప్పటి వరకు వేచిచూడక తప్పదని తెలుస్తోంది.కాగా ఈ సినిమాను బాలయ్య బాబే నిర్మించనున్నాడని సమాచారం.

More News

‘కె.జి.యఫ్‌ చాప్టర్‌ 2’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

సినిమా చరిత్రలో హిట్స్‌, సూపర్‌హిట్స్‌, బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు వస్తుంటాయి. కానీ ట్రె్‌ండ సెట్టింగ్‌ మూవీస్‌ మాత్రం అరుదుగానే వస్తుంటాయి.

ఎక్స్‌పోజింగ్‌ చేస్తే చూడటం లేదు: లావణ్య త్రిపాఠి

ఇప్పుడు ప్రేక్షకులు ఎక్స్‌పోజింగ్‌ చేస్తే చూడటం లేదని అంటుంది ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. కెరీర్‌ ప్రారంభంలో మంచి విజయాలు దక్కించుకుంది లావణ్య.

సంక్రాంతి కి రానున్న కల్యాణ్‌ రామ్‌ ‘ఎంతమంచివాడవురా'

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా  ’శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న దీనికి దర్శకత్వంలో

రేడియో సిటీ లో 'ప్రేమ పిపాసి' ఫస్ట్ సింగిల్ లాంచ్

ఎస్‌.ఎస్‌.ఆర్ట్ ప్రొడక్ష‌న్స్, యుగ క్రియేషన్స్  బ్యానర్స్ పై రాహుల్ భాయ్ మీడియా మ‌రియు దుర్గశ్రీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `ప్రేమ‌ పిపాసి`

ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు సెలక్ట్ అయిన 'జార్జ్ రెడ్డి'

ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటికీ రోల్ మోడల్ గా పేర్కొనే స్టూడెంట్ లీడర్ "జార్జ్ రెడ్డి" జీవితం ఆధారంగా సందీప్ మాధవ్ టైటిల్ పాత్రలో తెరకెక్కిన "జార్జ్ రెడ్డి"