బాలయ్య డిమాండ్..?
Send us your feedback to audioarticles@vaarta.com
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతోన్న 106వ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటోంది. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుందీ సినిమా. కరోనా ప్రభావంతో ఆగిన సినిమాల షూటింగ్స్ ప్రారంభమైన తర్వాత ఈ సినిమా తదుపరి షెడ్యూల్ షూటింగ్ జరుగనుంది. ఈ సినిమాలో ఓ కొత్త హీరోయిన్ ఉంటుందని ఇది వరకే దర్శకుడు బోయపాటి శ్రీను తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్‌లో ఓ హీరోయిన్ కొత్త హీరోయిన్ ఉంటే పరావాలేదు కానీ.. మరో హీరోయిన్ మాత్రం స్టార్ హీరోయిన్ ఉండాలని పర్టికులర్‌గా చెప్పేశాడట. దీంతో బోయపాటి ఓ స్టార్ హీరోయిన్ కోసం వెతుకులాటలో ఉన్నాడని సమాచారం.
చిత్రానికి మోనార్క్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని, జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను టైటిల్‌తో సహా అనౌన్స్ చేస్తారని అంటున్నారు. అలాగే ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఓ పాత్ర అఘోరా పాత్ర అని వార్తలు వినపడుతున్నాయి. ఈ చిత్రంలో భూమిక లేడీ విలన్‌గా నటిస్తుందట. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments