బాలకృష్ణ మళ్లీ అలాగే..
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి అందగాడు బాలకృష్ణకి సంక్రాంతి సీజన్ చాలా సార్లు కలిసొచ్చింది. వంశానికొక్కడు, పెద్దన్నయ్య, సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహాతో పాటు గతేడాది విడుదలైన గౌతమీపుత్ర శాతకర్ణి వరకు భారీ విజయాలు ఈ సీజన్లో దక్కాయి. వచ్చే సంవత్సరం కూడా ఇదే టైంలో తన కొత్త చిత్రంతో పలకరించేందుకు సిద్ధమవుతున్నారు బాలయ్య.
నయనతార హీరోయిన్గా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విశేషమేమిటంటే.. ఈ ఏడాది సంక్రాంతికి సందడి చేసిన గౌతమీపుత్ర శాతకర్ణి కూడా అదే తేదికి విడుదలైంది. అంతేకాదు.. ఆ చిత్రానికి సంగీతమందించిన చిరంతన్ భట్ ఈ తాజా చిత్రానికి కూడా సంగీతమందిస్తున్నాడు. సేమ్ మ్యూజిక్ డైరెక్టర్, సేమ్ డేట్.. మరి బాలయ్య సేమ్ మ్యాజిక్‌ని రిపీట్ చేస్తాడో లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments