ఆదిత్య 369 సీక్వెల్.. మోక్షజ్ఞపై బాలయ్య చేసింది సీరియస్ కామెంటా ?
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచిపోయే చిత్రం 'ఆదిత్య 369'. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం తెలుగు ప్రేక్షకులని ఉర్రూతలూగించింది. బాలయ్య నవరస నటనని ఈ చిత్రంలో చూడవచ్చు. మోడ్రన్ యువకుడిగా, శ్రీకృష్ణదేవరాయులుగా బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన తీరు అద్భుతం.
ఇదీ చదవండి: జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలయ్య.. రామారావు గారు అయ్యారు కదా అని..
శ్రీకృష్ణ దేవరాయలు ఇలాగే ఉంటారేమో అనేంత అద్భుతంగా బాలయ్య నటించారు. టైం ట్రావెల్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. బాలయ్య కూడా సరైన టైం కోసం ఎదురుచూస్తున్నాడు. గురువారం తన పుట్టిన రోజు సందర్భంగా బాలయ్య ఆదిత్య 369 సీక్వెల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఆదిత్య 369 సీక్వెల్ కు కథ రెడీ అయ్యిందని, ఆ చిత్రంలో తాను, మోక్షజ్ఞ తండ్రి కొడుకులుగా నటిస్తామని బాలయ్య తెలిపాడు. కథని సింగీతం శ్రీనివాసరావు గారికి కూడా వినిపించానని అన్నారు. కుదిరితే నేను దర్శకత్వం చేస్తా లేకుంటే నువ్వే చెయ్.. ఎవరికీ ఇవ్వొద్దు అని శ్రీనివాసరావు తనతో అన్నట్లు బాలయ్య తెలిపారు.
తాను తన తండ్రి శిష్యరికంలో నటుడిగా ఎదిగినట్లుగా..మోక్షజ్ఞని కూడా ఈ చిత్రంలో నటింపజేస్తా అని బాలయ్య అన్నారు. కానీ బాలయ్య మాటల్లో సీరియస్ నెస్ అయితే కనిపించలేదు. ఇంటర్వ్యూలో ప్రశ్నకు క్యాజువల్ గా సమాధానం ఇచ్చాడు తప్ప.. ఈ ప్రాజెక్ట్ పై కాంక్రీట్ గా ప్రకటన అయితే చేయనట్లు అనిపించింది.
గతంలో కూడా ఎన్టీఆర్ బయోపిక్ లో మోక్షజ్ఞ కూడా నటించే అవకాశం ఉందని బాలయ్య మీడియా ముందు తెలిపాడు. కానీ అది జరగలేదు. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అభిమానుల్లో చర్చ జరుగుతున్నా ఇంతవరకు బాలయ్య నుంచి బలమైన ప్రకటన రాలేదు.
ఆ మధ్యన మోక్షజ్ఞని బాలయ్య గుడులు గోపురాల చుట్టూ తిప్పుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ ఫోటోలు కూడా సామజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments