జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలయ్య.. రామారావు గారు అయ్యారు కదా అని..
Send us your feedback to audioarticles@vaarta.com
తన పుట్టినరోజు సందర్భంగా నందమూరి నటసింహం బాలకృష్ణ చేసిన కొన్ని వ్యాఖ్యలు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. బాలయ్య ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలపై మాట్లాడారు. ముఖ్యంగా జూ.ఎన్టీఆర్ గురించి బాలయ్య చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.
ఇదీ చదవండి: బాలయ్య, గోపీచంద్ మూవీలో క్రేజీ నటి.. ఈసారి ఆమె రోల్ ఏంటో !
2019 ఎన్నికల్లో టిడిపి ఘోర పరాభవం తర్వాత తెలుగుదేశం పార్టీలోకి జూ. ఎన్టీఆర్ రావాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మరికొందరైతే ఏకంగా ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చెప్పట్టాలని కోరుకుంటున్నారు. ఇలాంటి ప్రశ్నలు టిడిపి అధినాయకత్వానికి ఎదురైనప్పుడు దాటవేస్తున్నారు లేదా సైలెంట్ గా ఉంటున్నారు.
ఎన్టీఆర్ ని టిడిపిలోకి ఆహ్వానించడంపై ఆ పార్టీ నేతల నుంచి ఎప్పుడూ స్పష్టమైన ప్రకటన రాలేదు. తాజాగా బాలయ్యకు ఇంటర్వ్యూలో ఆ ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నపై స్పందించేందుకు బాలయ్య కూడా కాసేపు తటపటాయించినప్పటికీ చివరకు తన అభిప్రాయం తెలిపాడు. ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే ప్లస్సా మైనస్సా అని అడగగా.. మొదట ప్లస్సై ఆ తర్వాత మైనస్ అయితే పరిస్థితి ఏంటని బాలయ్యే తిరిగి ప్రశ్నించాడు.
ఎన్టీఆర్ ఎంట్రీ ప్లస్ అయినప్పటికీ ఆ తర్వాత పరిస్థితులు ఎలా మారుతాయో అనేది బాలయ్య ఉద్దేశం కావచ్చు. దీనికి కొనసాగింపుగా బాలయ్య మరికొన్ని కామెంట్స్ చేశారు. 'రామారావు గారు సినిమాల నుంచి వచ్చి రాజకీయాల్లో విజయం సాధించారు కదా అని అందరి గురించి అలా అనుకోకూడదు. నా వరకే తీసుకుంటే.. నేను పారదర్శకంగా ఉంటాను. అందుకే ప్రజలు నన్ను ఇష్టపడతారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే పారదర్శకత లోనుంచి అని బాలయ్య అన్నారు.
ఏది ఏమైనా ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాల్లో తిరుగులేని స్టార్ గా కొనసాగుతున్నాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments