సంక్రాంతికి రానున్న బాలయ్య 'యన్.టి.ఆర్' ?
Send us your feedback to audioarticles@vaarta.com
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా 'యన్.టి.ఆర్' చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న ఈ చిత్రానికి బాలకృష్ణ ఓ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.
రూ. అరవై కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఆగష్టు నుంచి పట్టాలెక్కించనున్నారు. ఈ మధ్య భుజానికి శస్త్ర చికిత్స చేసుకుని విశ్రాంతి తీసుకుంటున్న బాలకృష్ణ.. అప్పటికి పూర్తిగా కోలుకుంటారని సన్నిహితులు తెలియజేస్తున్నారు. సంచలన దర్శకుడు తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే పూర్తిచేసి.. 2019 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
అంటే.. తనకు కలిసొచ్చిన సంక్రాంతి సీజన్‌లోనే బాలకృష్ణ తదుపరి చిత్రం రానుందన్నమాట. ప్రస్తుతం.. పూర్వ నిర్మాణ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే వెల్లడించనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments