జగన్‌తో భేటీకి రానని చెప్పేసిన బాలయ్య.. నిజమేనా!?
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ పెద్దలు జూన్-09న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ కాబోతోన్నారు. ఈ భేటీలో పలువురు దర్శకులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ హాజరుకానున్నారు. ఇది కూడా మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలోనే జరగనుంది. ఇప్పటికే ఫలానా రోజు సీఎంతో భేటీ ఉంటుందని సీఎంవో కార్యాలయం నుంచి పిలుపు కూడా వచ్చింది. సరిగ్గా జూన్ 9 మధ్యాహ్నం 3:00 గంటలకు జగన్‌తో ఈ భేటీ జరగనుందని ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ మీడియాకు వివరించారు. దివంగత ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ భేటీకి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. వాస్తవానికి జూన్-01న ఈ భేటీ జరగాల్సి ఉన్నప్పటికీ సీఎం జగన్ బిజిబిజీగా ఉండటంతో ఆలస్యమైంది.
కాగా.. ఇప్పటికే చిరు ఇంట్లో, సీఎం కేసీఆర్‌తో జరిగిన భేటీకి సీనియర్ నటుడు కమ్ ఎమ్మెల్యే బాలకృష్ణను పిలవలేదని రచ్చరచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో బాలయ్యతో పాటు పలువురు పెద్దలు దాదాపు అందరికీ పిలుపు వెళ్లిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరిలో ప్రముఖలందరూ చిరుతో పాటు టీమ్‌గా వెళ్లి షూటింగ్స్‌తో పాటు, సినిమా రంగం అభివృద్ధితో పాటు రాష్ట్రానికి ఇండస్ట్రీ తరలింపు వ్యవహారంపై కూడా నిశితంగా చర్చించనున్నారని తెలుస్తోంది.
నేను రాలేను..!
అయితే.. బాలయ్య మాత్రం తాను రాలేనని ముందుగానే చెప్పేశారట. ఇందుకు రెండు కారణాలున్నాయని తెలుస్తోంది. జూన్-10న బాలయ్య పుట్టిన రోజు కావడంతో ముందురోజు ఏర్పాట్లు వగైరా ఉంటాయని అందుకే ఆయన రాలేకపోవచ్చుని తెలుస్తోంది. మరోవైపు.. ఇదివరకు జరిగిన సమావేశాలకు ఎందుకు పిలవలేదు..? ఇంత రాద్ధాంతం జరిగిన తర్వాత ఇప్పుడు పిలుస్తారా..? అని బాలయ్య అలకబూనారని కూడా తెలుస్తోంది. వాస్తవానికి జూన్-10తో బాలయ్య 60వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారు. పైగా షష్టిపూర్తి కాబట్టి గ్రాండ్‌గా చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు.. ఇప్పటికే వేడుకలకు రావాలని పలువురికి బాలయ్య మేనేజర్ నుంచి ఫోన్ కాల్ కూడా వచ్చిందని తెలుస్తోంది. అందుకే జగన్‌తో భేటీకి రాలేనని.. టాలీవుడ్ పెద్దల నుంచి ఫోన్ రాగానే చెప్పేశారట. మరి ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంతవరకూ రాలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com