బాలయ్య కొత్త సినిమా టైటిల్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగునాట ఫ్యాక్షన్ చిత్రాల కథానాయకుడిగా ట్రెండ్ సృష్టించారు నందమూరి బాలకృష్ణ. సమరసింహారెడ్డితో మొదలుపెట్టి నరసింహనాయుడు, సీమ సింహం, చెన్నకేశవ రెడ్డి.. ఇలా వరుస సినిమాలతో ఆ తరహా చిత్రాలకు చిరునామాలా నిలిచారు.
ఆ తరువాత పూర్తిస్థాయి ఫ్యాక్షన్ చిత్రం చేయని బాలయ్య.. చాలా కాలం తరువాత ఇదే జోనర్‌లో ఓ యాక్షన్ సినిమా చేయబోతున్నారు. చెన్నకేశవరెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాని సి.కళ్యాణ్ నిర్మించనున్నారు.
ఆగస్టులో ప్రారంభం కానున్నఈ సినిమాకు 'ఏకే 47' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టరైజేషన్‌తో బాలకృష్ణ రోల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. వచ్చే ఏడాదిలో సమ్మర్‌లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com