ఆకట్టుకుంటున్న బాలయ్య సరికొత్త లుక్
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ 106వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇటీవల రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ నెలలోనే రెండో షెడ్యూల్‌ను ప్రారంభించాల్సింది. కానీ కరోనా వైరస్ ప్రభావంతో షెడ్యూల్ వాయిదా పడింది. వచ్చే నెల మొదటి వారంలో ఈ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారు. అందులో ఓ గెటప్‌కి సంబంధించిన లుక్ ఒకటి బయటకు వచ్చింది. చిన్నపాటి జుట్టు, గుబురు మీసాలతో బాలయ్య లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. అలాగే మరో గెటప్‌లో బాలయ్య అఘోరా పాత్రలో కనిపించి ఆకట్టుకోనున్నారు. అంజలి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. మరో హీరోయిన్ పాత్రలో శ్రియాశరన్ లేదా పాయల్ రాజ్‌పుత్ నటించే అవకాశాలున్నాయని టాక్.
సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రమిది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వారణాసి, రాయలసీమ నేపథ్యాలలో సినిమా ప్రధానంగా సాగుతుంది. జగపతిబాబు ఇందులో విలన్‌గా నటించబోతున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com