భారీ అంచనాలతో బాలయ్య హంటింగ్ షురూ.. అంతా అతడి చేతుల్లోనే!

  • IndiaGlitz, [Thursday,June 10 2021]

నందమూరి బాలకృష్ణ నేడు 61వ బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు వరుసగా సర్ ప్రైజ్ లో ఎదురవుతున్నాయి. అఖండ కొత్త పోస్టర్ తో బుధవారం సాయంత్రమే బర్త్ డే సెలెబ్రేషన్స్ షురూ అయ్యాయి. తాజాగా బాలయ్య 107వ చిత్రానికి ప్రకటన వచ్చింది.

ఇదీ చదవండి: ఇండస్ట్రీకి షాక్: ఘంటసాల కుమారుడు మృతి.. ఆయన ట్రాక్ రికార్డ్ తెలుసా!

ముందుగా అనుకుంటున్నట్లుగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించేందుకు బాలయ్య రెడీ అయిపోయారు. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 'హంటింగ్ త్వరలోనే మొదలు కాబోతోంది' అంటూ ఓ అనౌన్స్మెంట్ వీడియో వదిలారు.

ఈ చిత్రానికి కూడా తమనే సంగీత దర్శకుడు. ప్రస్తుతం అఖండ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. గోపీచంద్, బాలయ్య చిత్రంపై ఇప్పటి నుంచే అంచనాలు మొదలైపోయాయి. గోపీచంద్ మలినేని క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో కసిమీద ఉన్నాడు.

బాలయ్యని గోపీచంద్ మలినేని ఎంత పవర్ ఫుల్ గా చూపిస్తాడో అనే అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. అఖండ పూర్తి కాగానే ఈ చిత్ర షూటింగ్ షురూ అవుతుంది.

More News

ఇండస్ట్రీకి షాక్: ఘంటసాల కుమారుడు మృతి.. ఆయన ట్రాక్ రికార్డ్ తెలుసా!

కరోనా విలయతాండవానికి సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా బలవుతున్నారు. తాజాగా ఇండస్ట్రీ మరో కీలక వ్యక్తిని కోల్పోయింది.

బాల బాబాయ్ అంటూ ఎన్టీఆర్, మిత్రుడు అంటూ చిరు.. బాలయ్యకు బర్త్ డే విషెష్

నందమూరి నటసింహం బాలకృష్ణ నేడు 61 జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా బాలయ్యకు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

నిర్మాతపై హీరో పోలీస్ కంప్లయింట్... ఎందుకంటే?

హీరో విశాల్, ప్రొడ్యూసర్ ఆర్.బి. చౌదరి మధ్య కొన్నాళ్లుగా ఆర్థిక లావాదేవీల విషయంలో సమస్యలు ఉన్నాయి.

ప్రభాస్, ప్రశాంత్ నీల్, దిల్ రాజు కాంబో.. మైండ్ బ్లోయింగ్ ప్లానింగ్!

రోజు రోజుకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ తారాస్థాయికి చేరుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న బడా దర్శకులు ప్రభాస్ డేట్స్ దొరికితే చాలు అన్నట్లుగా ఉన్నారు.

400 ట్రైబల్ కుటుంబాలకు అండగా భల్లాల దేవుడు!

కరోనా విపత్కర పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా తమ దాతృత్వం చాటుకుంటున్నారు.