17 ఏళ్ల `నరసింహనాయుడు'
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ కెరీర్లో మరచిపోలేని చిత్రాలలో నరసింహనాయుడు ఒకటి. గత రికార్డులను తిరగరాయడమే కాకుండా.. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం.. బాలయ్యకి ఉత్తమ నటుడుగా తొలిసారి నంది పురస్కారాన్ని కూడా అందించింది. రెండు షేడ్స్ ఉన్న ఈ పాత్రలో బాలయ్య నటన అభిమానులనే కాదు.. సగటు ప్రేక్షకులను కూడా అలరించింది.
లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి వంటి హ్యాట్రిక్ విజయాల తరువాత దర్శకుడు బి.గోపాల్ కాంబినేషన్లో బాలయ్య చేసిన ఈ మూవీ.. ఆ చిత్రాల కంటే మిన్నగా విజయాన్ని అందుకుంది.
సిమ్రాన్, ప్రీతి జింగానియా, ఆశా షైనీ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి మణిశర్మ అందించిన పాటలు, నేపథ్య సంగీతం ఎస్సెట్‌గా నిలిచాయి. తమిళంలో అర్జున్, సిమ్రాన్ జంటగా ఏళుమలై పేరుతో ఈ సినిమా రీమేక్ అయింది. జనవరి 11, 2001న విడుదలైన ఈ సినిమా.. నేటితో 17 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments