మళ్లీ రెచ్చిపోయిన బాలయ్య.. షాక్ ఇచ్చిన కార్యకర్త!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ మరోసారి రెచ్చిపోయారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సొంత పార్టీ కార్యకర్తపై బాలయ్య చిందులేయగా.. ఆ కార్యకర్త, అభిమాని షాకిచ్చారు. ఇప్పటికే పలుమార్లు అభిమానులు, కార్యకర్తలు, సొంత పార్టీ నేతలపై, మీడియాపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జరిగిన వ్యవహారమేంటో ఇప్పుడు చూద్దాం.
శనివారం నాడు నందమూరి బాలయ్య హిందూపురం సమీపంలోని సిరివరం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు, అభిమానులు తమ సమస్యను బాలయ్య దృష్టికి తీసుకెళ్లారు. ఆ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త రవికుమార్ తమ గ్రామ చెరువుకు నీరు విడుదల చేయాలని కోరారు. అందులో ఏం తప్పుందో..? ఏమోగానీ.. కార్యకర్త నోట నుంచి నీళ్ల మాట రాగానే బాలయ్య ఆగ్రహంతో ఊగిపోయారు.
ఏయ్ నడు.. అంటూ ఆ కార్యకర్తను పక్కకు తోసేశారు. అంతటితో ఆగని ఆయన.. బయటకు పంపాలని పోలీసులను ఆదేశించారు. బాలయ్య ఆదేశాలను తూచ తప్పకుండా పాటించిన పోలీసులు అతన్ని అక్కడ్నుంచి బయటికి పంపేశారు. నలుగురిలో ఈ ఘటన జరగడంతో తీవ్ర మనస్థాపానికి గురైన రవికుమార్ వెంటనే టీడీపీకి రాజీనామా చేసేశారు. అనంతరం ఆ గ్రామానికి పక్కనే ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ అభ్యర్థి ఇక్బాల్ సమక్షంలో కండువా కప్పుకున్నారు.
కాగా.. 2014 ఎన్నికలు మొదలుకుని మళ్లీ ఎన్నికలొచ్చినంత వరకూ బాలయ్య ఏదో ఒక వ్యవహారంలో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. అయితే ఇవన్నీ ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీకి బాగా అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
అంతేకాదు రేపొద్దున నియోజకవర్గంలో వైసీపీ గెలిచినా బాలయ్య తన అతి వల్లే ఓడిపోయారని కార్యకర్తలు, అభిమానులు అనుకున్నా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పెద్ద ఎత్తున సెటైర్లు వేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout