ఇద్దరిలో బాలయ్య ఎవరితో....
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందనున్న వందవ చిత్రంపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ చిత్ర దర్శకుడెవరనేది దానిపై చాలా రకాల పేర్లు వినపడ్డాయి. లెటెస్ట్ గా గమ్యం, కంచె ఫేమ్ జాగర్లమూడి క్రిష్, కృష్ణవంశీ పేర్లు వినపడుతున్నాయి. ఈ విషయంపై బాలకృష్ణ కూడా అవునన్నట్లే సమాధానమిచ్చారు. క్రిష్ దర్శకత్వంలో చారిత్రాత్మక నేపథ్యంలో గౌతమీపుత్ర శాతకర్ణి అనే సినిమా, కృష్ణవంశీ దర్శకత్వంలో రైతులకు సంబంధించిన ఓ కథను సిద్ధం అవుతుందట. ఈ రెండు చిత్రాల్లో ఏదీ ఫైనల్ చేయాలనే విషయాన్ని అమావాస్య తర్వాత తెలియజేస్తానని బాలకృష్ణ తెలియజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com