బాలయ్య వందో సినిమాకి క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్..
Thursday, March 31, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నటసింహం బాలకృష్ణ వందో సినిమా గురించి రోజుకో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వస్తుంది. బాలయ్య వందో సినిమాకి డైరెక్టర్ గా క్రిష్ ని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. గౌతమిపుత్ర శాతకర్ణి కథాంశంతో క్రిష్ ఈ చిత్రాన్నితెరకెక్కించనున్నారు.ఈ చిత్రం గురించి పూర్తి వివరాలను బాలయ్య ఉగాది రోజున ప్రకటించనున్నారు.
ఈ భారీ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం నయనతారను సంప్రదిస్తున్నారు. ఇదిలా ఉంటే..ఈ సినిమా గురించి బయటకు వచ్చిన ఇంట్రస్టింగ్ న్యూస్ ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారట. గతంలో బాలయ్య నటించిన లెజెండ్ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు రెండోసారి బాలయ్య చిత్రానికి దేవిశ్రీ మ్యూజిక్ చేయనున్నారు. ఈ చిత్రానికి యోధుడు అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments