బాలయ్య వందో సినిమాకి క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్..

  • IndiaGlitz, [Thursday,March 31 2016]

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ వందో సినిమా గురించి రోజుకో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌స్తుంది. బాల‌య్య వందో సినిమాకి డైరెక్ట‌ర్ గా క్రిష్ ని ఫిక్స్ చేసిన విష‌యం తెలిసిందే. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి క‌థాంశంతో క్రిష్ ఈ చిత్రాన్నితెర‌కెక్కించ‌నున్నారు.ఈ చిత్రం గురించి పూర్తి వివ‌రాల‌ను బాల‌య్య ఉగాది రోజున ప్ర‌క‌టించ‌నున్నారు.
ఈ భారీ చిత్రంలో క‌థానాయిక పాత్ర కోసం న‌య‌న‌తార‌ను సంప్ర‌దిస్తున్నారు. ఇదిలా ఉంటే..ఈ సినిమా గురించి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఇంట్ర‌స్టింగ్ న్యూస్ ఈ చిత్రానికి యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్నార‌ట‌. గ‌తంలో బాల‌య్య న‌టించిన లెజెండ్ చిత్రానికి దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు రెండోసారి బాల‌య్య చిత్రానికి దేవిశ్రీ మ్యూజిక్ చేయ‌నున్నారు. ఈ చిత్రానికి యోధుడు అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు.

More News

ఎన‌భై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న చుట్టాల‌బ్బాయి

ఆది, న‌మిత‌, యామిని హీరో, హీరోయిన్లుగా వీర‌భ‌ద్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం చుట్టాల‌బ్బాయి. ఈ చిత్రాన్నిశ్రీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ మూవీస్ బ్యాన‌ర్ పై వెంక‌ట్ త‌లారి నిర్మిస్తున్నారు.

స‌ర్ధార్ సెన్సార్ పూర్తి..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - కాజ‌ల్ జంట‌గా న‌టించిన చిత్రం స‌ర్ధార్ గబ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని బాబీ తెర‌కెక్కించారు. ఈ సెన్సేష‌న‌ల్ మూవీ సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను ఈరోజు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాకి యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చింది.

గ్లామ‌ర‌స్ అంటే స్కిన్ షో చేయ‌డం కాదు...అదే. - హీరోయిన్ హ‌ర్షిక

సూర్యతేజ, హర్షిక‌ పూనాచా హీరో హీరోయిన్లుగా రూపొందిన‌ చిత్రం అప్పుడలా ఇప్పుడిలా. కె.ఆర్.విష్ణు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. జంపా క్రియేషన్స్ బ్యానర్ పై  ప్రదీప్ కుమార్ జంపా ఈ చిత్రాన్ని నిర్మించారు.

బాలీవుడ్ లో సూర్య 24..

సూర్య హీరోగా మనం ఫేం విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్న క్రేజీ మూవీ 24.

బి.జె.పి తరుపున రజనీకాంత్ ప్రచారం..

సూపర్ స్టార్ రజనీకాంత్ కు తమిళనాడులో ఎలాంటి క్రేజ్ ఉన్నదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.