కబడ్డీ కోసం బరిలో దిగిన బాలయ్య, కిచ్చ సుదీప్, టైగర్ ష్రాప్
Send us your feedback to audioarticles@vaarta.com
నటసింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna) అటు సినిమాలు.. ఇటు టాక్ షో, యాడ్స్‌లతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే బాలయ్య హోస్ట్ చేస్తు్న్న అన్‌స్టాపబుల్ టాక్ షో సూపర్ హిట్ అవ్వగా.. తాజాగా మరో యాడ్‌తో అభిమానుల మందుకు వచ్చాయి. అయితే ఈసారి కొత్తగా ఓ ఆటకు సంబంధించిన లీగ్ కోసం ప్రచారం చేస్తు్‌న్నారు. ఇప్పటికే ఐపీఎల్, ఐఎస్ఎల్ లాంటి లీగ్‌లకు ఎంతో మంది సెలబ్రెటీలు ప్రచారం చేయగా.. ఇప్పుడు కబడ్డీ లీగ్ కోసం ముగ్గురు హీరోలు ముందుకొచ్చారు.
ప్రో కబడ్డీ లీగ్(Pro Kabaddi League) కోసం బాలయ్యతో పాటు కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్(Kichcha Sudeep), బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాప్(Tiger Shroff)లు రంగంలోకి దిగారు. ఈ ముగ్గురు హీరోలతో కలిపి నిర్వాహకులు ఓ యాడ్ డిజైన్ చేశారు. ఇందులో ముగ్గురు గుర్రాల మీద యోధుల్లాగా వచ్చి కబడ్డీ కోర్టు నిప్పుతో గీసి, అందులో కబడ్డీ ఆడినట్టు పవర్ ఫుల్‌గా చూపించారు. చివర్లో బాలయ్య మ్యాచ్ గెలిచి తొడకొట్టినట్టు చూపించారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
'కబడ్డీ.. మన మట్టిలో పుట్టిన ఆట. మన తెలుగువాడి పౌరుషాన్ని తెలిపే ఆట. కండల బలమే ఆయుధంగా, మైదానమే రణస్థలంగా, పోరాడే ఈ దమ్మున్న ఆటను అస్సలు మిస్ కావద్దు' అంటూ చెబుతున్నారు. ఇక ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 డిసెంబర్ 2 నుంచి మొదలు కానుంది. ఈసారి 12 టీమ్స్ లీగ్‌లో తలపడనున్నాయి. దీంతో మూడు ఇండస్ట్రీలకు చెందిన హీరోలతో యాడ్ చేసి ప్రమోట్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments