బాలయ్య, కళ్యాణ్ సినిమా ఎప్పుడంటే..
- IndiaGlitz, [Sunday,April 15 2018]
నటసింహ నందమూరి బాలకృష్ణ.. ‘జై సింహా’ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ వరుస సినిమాలు చేస్తున్నారు. ఇటీవల తేజ దర్శకత్వంలో ‘యన్.టి.ఆర్’ చిత్రాన్ని ప్రారంభించిన బాలయ్య.. త్వరలోనే మరో సినిమాకు శ్రీకారం చుట్టనున్నారని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాస్త వివరాల్లోకి వెళితే.. ఇటీవల వి.వి.వినాయక్ డైరెక్షన్లో ప్రముఖ నిర్మాత కళ్యాణ్ ‘ఇంటిలిజెంట్’ అనే సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో.. నిర్మాత కళ్యాణ్ బాగా నష్టపోయారు.
ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి.. ‘జై సింహా’ నిర్మాత అయిన కళ్యాణ్ నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకి కూడా వినాయక్ దర్శకత్వం వహించనుండడం విశేషం. అయితే.. మంచి కథ ఉంటేనే వినాయక్‌తో సినిమా చేస్తానని బాలయ్య చెప్పడంతో.. ఇప్పుడు కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారట వినాయక్. అన్ని కుదిరితే ఈ సినిమాను వచ్చే నెల 12న లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాత కళ్యాణ్. కాగా.. ‘యన్.టి.ఆర్’ సినిమా పూర్తయిన తర్వాతే.. వినాయక్ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని సమాచారం.