కర్ణ, అర్జునులుగా బాబాయ్ అబ్బాయ్
Send us your feedback to audioarticles@vaarta.com
బాబాయ్ నందమూరి బాలకృష్ణ, అబ్బాయ్ కల్యాణ్‌రామ్ 'యన్.టి.ఆర్' బయోపిక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత చరిత్రను 'యన్.టి.ఆర్ కథానాయకుడు', 'యన్.టి.ఆర్ మహానాయకుడు' అనే రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు భాగాల్లో బాబాయ్ బాలయ్య, అబ్బాయ్ కల్యాణ్ రామ్ కలిసి నటిస్తున్నారు. నిజ జీవితంలో యన్టీఆర్ తోడుగా హరికృష్ణ ఉన్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఆ పాత్రలను సినిమాలో పోషిస్తున్నారు. పార్ట్ వన్ కథానాయకుడు విషయానికి వస్తే.. ఎన్టీఆర్ నట జీవితంలో 'దానవీర శూర కర్ణ' చిత్రానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇందులో ఎన్టీఆర్ దుర్యోధనుడు, కర్ణుడు పాత్రలు వేసిన సంగతి తెలిసిందే. అర్జునుడు పాత్రను హరికృష్ణ పోషించారు. ఇప్పుడు బయోపిక్‌లో బాలకృష్ణ దుర్యోధనుడు, కర్ణుడి పాత్రల్లో కనపడుతుంటే.. కల్యాణ్ రామ్ అర్జునుడిగా పాత్ర చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ పార్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments