'జై సింహా' భారీ వైజాగ్ షెడ్యూల్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున యాక్షన్ ఎంటర్ టైనర్ "జై సింహా". బాలకృష్ణ సరసన నయనతార, నాటాషా జోషీ, హరిప్రియలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం వైజాగ్ లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకొని త్వరలో మరో షెడ్యూల్ కి సన్నద్ధమవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. "వైజాగ్ బీచ్ రోడ్ లో 5000 వేల జూనియర్ ఆర్టిస్టులు, 110 బస్సులతో "మహా ధర్నా" సీక్వెన్స్, బాలకృష్ణ-హరిప్రియలపై ఓ రోమాంటిక్ సాంగ్ తోపాటు, బాలయ్య-నయనతారపై ఓ మాంటేజ్ సాంగ్ ను షూట్ చేశాం. అవుట్ పుట్ చాలా అద్భుతంగా వచ్చింది... అలాగే ఇటీవల విడుదల చేసిన బాలయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ కు, టైటిల్ కు విశేషమైన స్పందన లభిస్తోంది. ఇప్పటివరకూ బాలయ్య కెరీర్ లో "సింహా" అనే టైటిల్స్ తో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయినట్లుగానే.. "జై సింహా" కూడా సూపర్ హిట్ అవ్వడం ఖాయం" అన్నారు.
బాలకృష్ణ, నయనతార, నటాషా దోషీ, ప్రకాష్ రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, ప్రభాకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: ఎం.రత్నం, కళ: నారాయణ రెడ్డి, పోరాటాలు: అరివుమణి-అంబుమణి, సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్ భట్, సహ-నిర్మాత: సి.వి.రావు, ఎద్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వరుణ్-తేజ, నిర్మాణం: సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments