'జై సింహా' భారీ వైజాగ్ షెడ్యూల్ పూర్తి

  • IndiaGlitz, [Saturday,November 11 2017]

నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున యాక్షన్ ఎంటర్ టైనర్ "జై సింహా". బాలకృష్ణ సరసన నయనతార, నాటాషా జోషీ, హరిప్రియలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం వైజాగ్ లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకొని త్వరలో మరో షెడ్యూల్ కి సన్నద్ధమవుతోంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. "వైజాగ్ బీచ్ రోడ్ లో 5000 వేల జూనియర్ ఆర్టిస్టులు, 110 బస్సులతో "మహా ధర్నా" సీక్వెన్స్, బాలకృష్ణ-హరిప్రియలపై ఓ రోమాంటిక్ సాంగ్ తోపాటు, బాలయ్య-నయనతారపై ఓ మాంటేజ్ సాంగ్ ను షూట్ చేశాం. అవుట్ పుట్ చాలా అద్భుతంగా వచ్చింది... అలాగే ఇటీవల విడుదల చేసిన బాలయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ కు, టైటిల్ కు విశేషమైన స్పందన లభిస్తోంది. ఇప్పటివరకూ బాలయ్య కెరీర్ లో "సింహా" అనే టైటిల్స్ తో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయినట్లుగానే.. "జై సింహా" కూడా సూపర్ హిట్ అవ్వడం ఖాయం" అన్నారు.

బాలకృష్ణ, నయనతార, న‌టాషా దోషీ, ప్రకాష్ రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, ప్రభాకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: ఎం.రత్నం, కళ: నారాయణ రెడ్డి, పోరాటాలు: అరివుమణి-అంబుమణి, సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్ భట్, సహ-నిర్మాత: సి.వి.రావు, ఎద్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వరుణ్-తేజ, నిర్మాణం: సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్!

More News

అనుప‌మ బాట‌లో మెహ‌రీన్‌

కేర‌ళ‌కుట్టి అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బాట‌లోనే పంజాబి జాబిలి మెహ‌రీన్ అడుగులు వేస్తోందా? అవున‌నే అనిపిస్తోంది.. వారి సినిమాల ఫ‌లితాల‌ను చూస్తుంటే.

'జ‌వాన్' కోసం రాశి పాట‌

ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యమైన ఉత్త‌రాది భామ రాశి ఖ‌న్నా. ఆ త‌రువాత జిల్‌, బెంగాల్ టైగ‌ర్‌, జై ల‌వ కుశ త‌దిత‌ర చిత్రాల్లో త‌న గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకున్న ఈ ముద్దుగుమ్మ‌.. ప్ర‌స్తుతం ర‌వితేజ‌తో ట‌చ్ చేసి చూడు సినిమా చేస్తోంది.

ఫైట్ మాస్ట‌ర్ నాగ‌రాజు కుటుంబానికి 5ల‌క్ష‌ల చెక్ అంద‌జేత‌

ఫైట్ మాస్ట‌ర్ నాగ‌రాజు 'నేనే రాజు నేనే మంత్రి' షూటింగ్ స‌మ‌యంలో అనారోగ్యం కార‌ణంగా చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆ చిత్ర యూనిట్ తో పాటు, సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన మ‌రికొంత మంది స‌హ‌కారంతో ఆర్ధిక స‌హాయం ప్ర‌క‌టించింది.

15 ఏళ్లు పూర్తిచేసుకున్న ప్ర‌భాస్‌

ప్ర‌భాస్‌.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరిది. బాహుబ‌లి, బాహుబ‌లి 2 చిత్రాల‌తో వ‌రల్డ్ వైడ్‌గా ఫేమ‌స్ అయిన మ‌న తెలుగు క‌థానాయ‌కుడు ప్ర‌భాస్‌. అలాంటి ప్ర‌భాస్ కి ఇవాళ ఎంతో స్పెష‌ల్‌.

ఆకట్టుకుంటున్న కార్తీ, రకుల్ జంట

ఈ జనరేషన్లో తెలుగులో అభిమానుల సంఖ్యను గణనీయంగా ఏర్పరచుకున్న అతి కొద్ది మంది తమిళ హీరోల్లో కార్తి ఒకరు. మరోవైపు రకుల్ కి తెలుగులో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.