బాలకృష్ణ 'జై సింహా' టాకీ పార్ట్ పూర్తి

  • IndiaGlitz, [Friday,December 01 2017]

నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున యాక్షన్ ఎంటర్ టైనర్ "జై సింహా". బాలకృష్ణ సరసన నయనతార, నాటాషా జోషీ, హరిప్రియలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం నేటితో రామోజీ ఫిలిమ్ సిటీలో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ ను పూర్తి చేసుకొని టాకీ పార్ట్ పూర్తి చేసుకోనుంది.

రామోజీ ఫిలిమ్ సిటీలో వేసిన స్పెషల్ సెట్ లో బాలకృష్ణ-అశుతోష్ రాణా కాంబినేషన్ లో 60 మంది ఫైటర్స్ తో రామ్-లక్ష్మణ్ ల నేతృత్వంలో ఒక కృషియల్ ఫైట్ సీక్వెన్స్ ను తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న "జై సింహా" చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. "బాలయ్య-నయనతారల కాంబినేషన్ ఈ సినిమాలో విశేషంగా అలరిస్తుంది. ఇవాల్టితో రామోజీ ఫిలిమ్ సిటీలో వేసిన భారీ సెట్ లో ఫైట్ సీక్వెన్స్ పూర్తవుతుంది. దీంతో టాకీ పార్ట్ కంప్లీట్ అయినట్లే. విడుదలైన టైటిల్ మరియు బాలకృష్ణ ఫస్ట్ లుక్ కి నందమూరి అభిమానుల నుంచే కాక తెలుగు సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకానున్న సినిమా కూడా అదే స్థాయిలో అలరిస్తుంది" అన్నారు.

బాలకృష్ణ, నయనతార, న‌టాషా దోషీ, హరిప్రియ, ప్రకాష్ రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, ప్రభాకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: ఎం.రత్నం, కళ: నారాయణ రెడ్డి, పోరాటాలు: అంబరివ్-రామ్ లక్ష్మణ్-వెంకట్, సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్ భట్, సహ-నిర్మాత: సి.వి.రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వరుణ్-తేజ, నిర్మాణం: సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్!

More News

'సైరా' గురించి క్లారిటీ ఇచ్చిన థమన్

'ఖైదీ నెం.150' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న చిత్రం ‘సైరా న‌ర‌సింహారెడ్డి’. చిరు 151వ చిత్రంగా 'సైరా' రూపుదిద్దుకుంటోంది.

'భరత్ అనే నేను' ఆడియో రైట్స్.. ఆ సంస్థకే

శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

విశాల్ కోసం ధనుష్ పాట

తమిళ చిత్రాల కథానాయకుడు ధనుష్.. బహుముఖప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు. కేవలం నటనకే పరిమితం కాకుండా గానం, నిర్మాణం, దర్శకత్వం.. వంటి విభాగాల్లోనూ రాణించారు ఈ మల్టీ టాలెంటెడ్ హీరో.

వైజాగ్ లో 'హలో' ఆడియో

అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ‘అఖిల్’ ఆశించిన ఫలితం సాధించలేదు. ప్రస్తుతం.. టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ కాంబినేషన్లో తన రెండో చిత్రాన్ని చేస్తున్నాడీ యువ కథానాయకుడు. ఆ సినిమానే ‘హలో’.

దిల్ రాజు.. ఏడు సినిమాలు?

2017 దిల్ రాజుకి బాగా కలిసొచ్చిన సంవత్సరమనే చెప్పాలి. ఈ సంవత్సరం ఆరంభంలో 'శతమానం భవతి' తో హిట్ ని అందుకున్నారు. తర్వాత వరుసగా 'నేను లోకల్', 'దువ్వాడ జగన్నాధం', 'ఫిదా', 'రాజా ది గ్రేట్', 'ఎం.సి.ఎ.'.. ఇలా సుమారు రెండు నెలలకి ఒక సినిమా ప్లాన్ చేసుకున్నారు దిల్ రాజు.