బంధువులను ఆహ్వానిస్తున్న బాలయ్య
Send us your feedback to audioarticles@vaarta.com
దివంగత నేత, మహానటుడు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'యన్.టి.ఆర్'. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 29 నుంచి షూటింగ్‌ను ప్రారంభించనున్నట్టు ఇప్పటికే బాలకృష్ణ అధికారికంగా ప్రకటించారు.
ఇదిలా ఉంటే.. ఈ ప్రారంభోత్సవానికి తన తల్లిదండ్రుల తరపు బంధువులను కూడా ఆహ్వానించేందుకు బాలయ్య సన్నాహాలు చేసుకుంటున్నారని తెలిసింది.ఇప్పటికే.. తల్లి స్వగ్రామమైన కొమరవోలులో స్వయంగా పర్యటించి.. తన తల్లిదండ్రుల విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆ పైన ఆ ఊళ్ళో బంధువులను ఈ వేడుకకు ఆహ్వానించారట.
అలాగే.. ఎన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరులో కూడా బంధువులను ఈ నెల 29న జరగబోయే కార్యక్రమానికి వచ్చి, తనను ఆశీర్వదించమని కోరారట. 29న రామకృష్ణ స్టూడియోస్‌లో లాంఛనంగా షూటింగ్ ప్రారంభించి.. మే నుంచి నిరవధికంగా చిత్రీకరించనున్నామని తెలియజేసారు బాలకృష్ణ. అలాగే తనకు అచ్చొచ్చిన సంక్రాంతి సీజన్‌లో ఈ సినిమాను విడుదల చేయాలని కూడా బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments