బంధువుల‌ను ఆహ్వానిస్తున్న బాల‌య్య‌

  • IndiaGlitz, [Wednesday,March 07 2018]

దివంగ‌త నేత‌, మహానటుడు ఎన్టీఆర్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్రం 'య‌న్‌.టి.ఆర్‌'. నంద‌మూరి బాలకృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 29 నుంచి షూటింగ్‌ను ప్రారంభించనున్నట్టు ఇప్ప‌టికే బాలకృష్ణ అధికారికంగా ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. ఈ ప్రారంభోత్స‌వానికి తన తల్లిదండ్రుల తరపు బంధువులను కూడా ఆహ్వానించేందుకు బాల‌య్య స‌న్నాహాలు చేసుకుంటున్నార‌ని తెలిసింది.ఇప్ప‌టికే.. తల్లి స్వగ్రామమైన కొమరవోలులో స్వయంగా పర్యటించి.. తన తల్లిదండ్రుల విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆ పైన ఆ ఊళ్ళో బంధువులను ఈ వేడుకకు ఆహ్వానించార‌ట.

అలాగే.. ఎన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరులో కూడా బంధువులను ఈ నెల 29న జరగబోయే కార్యక్రమానికి వచ్చి, తనను ఆశీర్వదించమని కోరార‌ట‌. 29న రామకృష్ణ స్టూడియోస్‌లో లాంఛనంగా షూటింగ్ ప్రారంభించి.. మే నుంచి నిరవధికంగా చిత్రీకరించనున్నామని తెలియజేసారు బాలకృష్ణ. అలాగే తనకు అచ్చొచ్చిన సంక్రాంతి సీజ‌న్‌లో ఈ సినిమాను విడుదల చేయాలని కూడా బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నారు.

More News

అలాంటి పాత్ర‌లు చేయ‌నంటున్న నిత్యా

పాత్ర ఎటువంటిదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి.. ఆ పాత్రకే వన్నె తెచ్చే నటి నిత్య మీనన్. ఇటీవల నాని నిర్మాణంలో ఆమె నటించిన 'అ!' సినిమాలో.. లెస్బియన్ పాత్రకి ఎవరిని ఎంపిక చేయాలా అని దర్శకుడు తర్జనభర్జన పడుతూ ఉంటే.. నాని వెంటనే ఈ పాత్ర గురించి నిత్యకి చెప్పు, ఎగిరి గంతేసి ఒప్పుకుంటుంది అని చెప్పారంటే.. ఒక నిర్మాతగా నానికి ఆమె పై ఉన్న నమ్మకం ఏ

'ఆఫీసర్'కి ఓ ప్ల‌స్ పాయింట్ ఏంటంటే..

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆఫీసర్'. వర్మ స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో నాగార్జున పవర్‌ఫుల్‌ పోలీస్ ఆఫీసర్ పాత్ర‌లో కనిపించనున్నారు.

మరో తమిళ సినిమా లో.. మంచు లక్ష్మి

మంచు లక్ష్మి మరో తమిళ సినిమా చేయబోతోంది. మంచి కథలకే నా ఓటు అని ముందు నుంచీ చెబుతోన్న లక్ష్మి అందుకు తగ్గట్టే కంటెంట్ ఉన్న కథలనే సెలెక్ట్ చేసుకుంటోంది. ప్రస్తుతం 'వైఫ్ ఆఫ్ రామ్' అనే ఓ కొత్తతరహా కథతో రాబోతోన్న లక్ష్మికి మరో మంచి ఆఫర్ వచ్చింది.

చిరంజీవి 'మగధీరుడు'కి 32 ఏళ్ళు

బంధాలు,బాంధవ్యాల విలువల్ని చెప్తూనే,అంతర్లీనంగా స్నేహం గొప్పతనాన్ని కూడా చాటి చెప్పిన చిత్రం 'మగధీరుడు'.

'ఎన్.జి.కె' టైటిల్ గురించి దర్శకుడు ఏమన్నారంటే..

తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా(సూర్య 36)తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.