close
Choose your channels

Balakrishna:మోక్షజ్ఞ ఎంట్రీపై బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

Wednesday, May 29, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్‌ హీరో, మాస్ కా దాస్ విశ్వక్‌ సేన్‌ నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ మంగళవారం రాత్రి ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వెషన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో విశ్వక్‌ సేన్‌పై ఆయన చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. విశ్వక్ అచ్చం తనలాగే ఉంటాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. "విశ్వక్‌ సేన్‌ గురించి చెప్పాలంటే అతడిది ఉడుకు రక్తం. అచ్చం నాలాగే. సినిమాలో ఏదోక వైవిధ్యం ఉండేలా ప్రయోగాలు చేస్తున్నాడు. విశ్వక్‌ సేన్‌ చూస్తుంటే నన్ను నేను చూసుకుంటున్నట్టు ఉంది. ఇద్దరం మంచి సోదరులం. ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా బయటక మమ్మల్ని చూస్తే కవలలు అంటారు. ఇద్దరం అన్నదమ్ముళ్లు లాంటి వాళ్లం. కానీ, నేనే అతడికి కంటే చిన్న. నాకు విశ్వక్‌ సేన్‌ అన్నయ్య అవుతాడు. సినిమా అంటే ఫ్యాషన్‌. సినిమా సినిమాకు కొత్తదనం ఉండేలా చూస్తున్నాడు. నేను కూడా అంతే కొత్తగా ఇవ్వాలనుకుంటున్నాడు.

నాకు ఎలా అయితే దూకుడుతనం ఉందో తనకి కూడా అలాగే ఉంది. ఇక గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి టైటిల్‌ విచిత్రంగా ఉంది. ఇలా ఉండాలి మూవీ టైటిల్స్‌ అంటే. ఈ సినిమా మంచి హిట్‌ అవుతుంది.. మీరంత సినిమా ఆదరిస్తారు.. మూవీ హిట్‌ చేస్తారు. ఇక ఈ మూవీ నిర్మాతలు పేర్లు ఎంటో చాలా టఫ్‌గా ఉంది. ముగ్గురు ఈ సినిమా నిర్మిస్తున్నారు. వారి పేర్లు చెప్పడం కష్టంగా ఉంది. గ్యాంగ్స్‌ గోదావరి నిర్మాతలు ఎవరని అన్‌స్టాపబుల్‌లో క్వశ్చన్‌ కూడా అడగోచ్చు అలా ఉంది" అంటూ చెప్పుకొచ్చారు.

అనంతరం తన తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీపై కూడా స్పందించారు. "నెక్ట్స్‌ నా కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. వాడు ఇండస్ట్రీకి వస్తాడు. అలాంటి వారికి మీరంతా స్ఫూర్తిగా ఉండాలి. నన్ను అసలు ఇన్‌స్పరెషన్‌గా తీసుకోవద్దని మోక్షకి చెబుతుంటాను. నన్నే కాదు మీ తాత నందమూరి తారకరామారావుని కూడా తీసుకోవద్దు ఎవ్వరు అవసరం లేదు. విశ్వక్‌ సేన్‌, అడవి శేష్‌, సిద్ధు జొన్నలగడ్డ వంటి వారిని ఇన్‌స్పరేషన్‌గా తీసుకోమని చెబుతుంటాను" అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ప్రస్తుతం బాలయ్య వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే బాలయ్య వారసుడు ఎంట్రీ ఖాయమని అభిమానులు పోస్టులు చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment