Balakrishna:మోక్షజ్ఞ ఎంట్రీపై బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

  • IndiaGlitz, [Wednesday,May 29 2024]

యంగ్‌ హీరో, మాస్ కా దాస్ విశ్వక్‌ సేన్‌ నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ మంగళవారం రాత్రి ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వెషన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో విశ్వక్‌ సేన్‌పై ఆయన చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. విశ్వక్ అచ్చం తనలాగే ఉంటాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. విశ్వక్‌ సేన్‌ గురించి చెప్పాలంటే అతడిది ఉడుకు రక్తం. అచ్చం నాలాగే. సినిమాలో ఏదోక వైవిధ్యం ఉండేలా ప్రయోగాలు చేస్తున్నాడు. విశ్వక్‌ సేన్‌ చూస్తుంటే నన్ను నేను చూసుకుంటున్నట్టు ఉంది. ఇద్దరం మంచి సోదరులం. ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా బయటక మమ్మల్ని చూస్తే కవలలు అంటారు. ఇద్దరం అన్నదమ్ముళ్లు లాంటి వాళ్లం. కానీ, నేనే అతడికి కంటే చిన్న. నాకు విశ్వక్‌ సేన్‌ అన్నయ్య అవుతాడు. సినిమా అంటే ఫ్యాషన్‌. సినిమా సినిమాకు కొత్తదనం ఉండేలా చూస్తున్నాడు. నేను కూడా అంతే కొత్తగా ఇవ్వాలనుకుంటున్నాడు.

నాకు ఎలా అయితే దూకుడుతనం ఉందో తనకి కూడా అలాగే ఉంది. ఇక గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి టైటిల్‌ విచిత్రంగా ఉంది. ఇలా ఉండాలి మూవీ టైటిల్స్‌ అంటే. ఈ సినిమా మంచి హిట్‌ అవుతుంది.. మీరంత సినిమా ఆదరిస్తారు.. మూవీ హిట్‌ చేస్తారు. ఇక ఈ మూవీ నిర్మాతలు పేర్లు ఎంటో చాలా టఫ్‌గా ఉంది. ముగ్గురు ఈ సినిమా నిర్మిస్తున్నారు. వారి పేర్లు చెప్పడం కష్టంగా ఉంది. గ్యాంగ్స్‌ గోదావరి నిర్మాతలు ఎవరని అన్‌స్టాపబుల్‌లో క్వశ్చన్‌ కూడా అడగోచ్చు అలా ఉంది అంటూ చెప్పుకొచ్చారు.

అనంతరం తన తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీపై కూడా స్పందించారు. నెక్ట్స్‌ నా కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. వాడు ఇండస్ట్రీకి వస్తాడు. అలాంటి వారికి మీరంతా స్ఫూర్తిగా ఉండాలి. నన్ను అసలు ఇన్‌స్పరెషన్‌గా తీసుకోవద్దని మోక్షకి చెబుతుంటాను. నన్నే కాదు మీ తాత నందమూరి తారకరామారావుని కూడా తీసుకోవద్దు ఎవ్వరు అవసరం లేదు. విశ్వక్‌ సేన్‌, అడవి శేష్‌, సిద్ధు జొన్నలగడ్డ వంటి వారిని ఇన్‌స్పరేషన్‌గా తీసుకోమని చెబుతుంటాను అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ప్రస్తుతం బాలయ్య వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే బాలయ్య వారసుడు ఎంట్రీ ఖాయమని అభిమానులు పోస్టులు చేస్తున్నారు.

More News

Jana Sena, YCP:పిఠాపురంలో నయా ట్రెండ్.. తగ్గదేలే అంటున్న జనసేన, వైసీపీ క్యాడర్..

ఏపీ ఎన్నికల కౌంటింగ్‌కు మరో ఆరు రోజులు మాత్రమే సమయం ఉంది.  దీంతో అందరూ ఫలితాలతపై ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Pinnelli: పిన్నెల్లికి ఏపీ హైకోర్టులో మరోసారి భారీ ఊరట..

పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరోసారి భారీ ఊరట దక్కింది. ఆయనపై నమోదైన మరో మూడు కేసుల్లో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

RS Praveen Kumar: తెలంగాణ గీతంపై ఆంధ్రా సంగీత దర్శకుడు పెత్తనం ఏంది బై: ఆర్‌ఎస్పీ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న రాష్ట్ర గీతం 'జయజయహే తెలంగాణ' చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని

Rakshana: పాయల్ రాజ్‌పుత్ 'రక్షణ' జూన్ 7న గ్రాండ్ రిలీజ్

‘Rx100’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో తనదైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన పాత్ర‌ల‌కు భిన్నంగా..ప‌వ‌ర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో

Pune Car Incident: పుణే ర్యాష్ డ్రైవింగ్ కేసులో అదిరిపోయే ట్విస్టులు.. తాజా ట్విస్ట్ ఏంటంటే..?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణేలో డ్రంకన్ డ్రైవ్ కారు కేసులో రోజుకో సంచలన పరిణామం చోటుచేసుకుంటుంది. థ్రిల్లర్ మూవీలను మించిన ట్విస్టులు బయటపడుతున్నాయి.